Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ వివాదంలో కొత్త ట్విస్ట్!

పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ ఉపయోగిస్తూ కెమెరాకు చిక్కాడు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశంలో ఈ-సిగరెట్ల అమ్మకం, వినియోగం నిషేధం. మరోవైపు ఐపీఎల్ నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్ రూమ్ అనేది 'నో స్మోకింగ్ జోన్'. ఓ బాధ్యతాయుతమైన కెప్టెన్ పదవిలో ఉండి, కోట్లాది మంది చూస్తున్న లైవ్ మ్యాచ్‌లో ఇలాంటి చర్యకు పాల్పడటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిబంధనల్లో లొసుగు.. రియాన్ పరాగ్‌కు ఊరట?
ఈ ఘటనపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని అందరూ భావించినప్పటికీ.. తాజా నివేదికల ప్రకారం రియాన్ పరాగ్ ఈ వివాదం నుంచి సులభంగానే బయటపడే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్ రూల్ బుక్. లైవ్ మ్యాచ్ సమయంలో ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి నిషేధిత వస్తువును వాడితే శిక్షించేందుకు స్పష్టమైన నిబంధనలు రూల్ బుక్‌లో లేవని సమాచారం. ఈ లొసుగు రియాన్ పరాగ్‌కు వరంగా మారింది. దీంతో ఆటగాడి కంటే కూడా అతడిని ఆ వస్తువుతో లోపలికి అనుమతించిన అధికారులనే బీసీసీఐ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

Riyan Parag E-Cigarette Controversy IPL Rule Loophole May Save Rajasthan Royals Captain Full Details

మ్యాచ్ రెఫరీపై బీసీసీఐ వేటు?
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ-సిగరెట్‌ను డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎలా తీసుకెళ్లగలిగాడనే అంశంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. రూల్స్ ప్రకారం డ్రెస్సింగ్ రూమ్ లోపలికి వెళ్లే ప్రతి వస్తువును పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. అందుకే ఈ వైఫల్యానికి బాధ్యుడిని చేస్తూ మ్యాచ్ రెఫరీపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. "ఆటగాడిని శిక్షించడానికి రూల్ బుక్‌లో నిబంధనలు లేవు, కానీ నిషేధిత వస్తువును లోపలికి అనుమతించినందుకు మ్యాచ్ రెఫరీకి జరిమానా విధిస్తాం" అని రాజస్థాన్ రాయల్స్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

జాగ్రత్తగా ఉండాలి: మాజీ అంపైర్ అనిల్ చౌదరి
ఈ వివాదంపై మాజీ అంపైర్ అనిల్ చౌదరి స్పందిస్తూ.. ఇది పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యమని పేర్కొన్నారు. మైదానంలో ప్రతి అంగుళాన్ని కెమెరాలు గమనిస్తుంటాయని, ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. "నేటి యువ ఆటగాళ్లకు తెలియడం లేదు కానీ, బాత్‌రూమ్ మినహా ప్రతి చోటా కెమెరాలు ఉంటాయి. టీవీల్లో మంచి విషయాలు చూపించాలి, ఆట గురించి చర్చించాలి కానీ ఇలాంటి అనవసర విషయాలు కాదని" ఆయన హితవు పలికారు. ఏది ఏమైనా, నిబంధనల లొసుగుతో రియాన్ పరాగ్ ప్రస్తుతానికి భారీ శిక్ష నుంచి తప్పించుకున్నట్లు కనిపిస్తోంది.

Story first published: Thursday, April 30, 2026, 13:44 [IST]
Other articles published on Apr 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+