కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. MI గడ్డపై SRH ఫ్యాన్స్ మాస్ రివేంజ్! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన 41వ మ్యాచ్ స్టేడియంలోనే కాకుండా గ్యాలరీలోనూ హై-వోల్టేజ్ డ్రామాను తలపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లు.. ముఖ్యంగా ర్యాన్ రికెల్టన్ సెంచరీతో చెలరేగుతుంటే వాంఖడే స్టేడియం ముంబై నినాదాలతో దద్దరిల్లిపోయింది. తమ జట్టు భారీ స్కోరు సాధించడంతో ఆ ఉత్సాహంలో ఉన్న ముంబై మద్దతుదారులు.. స్టేడియంలో ఉన్న కొద్దిమంది సన్‌రైజర్స్ అభిమానులను టార్గెట్ చేస్తూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి ఖాయమని భావించిన హైదరాబాద్ ఫ్యాన్స్ అప్పటివరకు మౌనంగా ఉండిపోయారు.
సీన్ రివర్స్.. కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం!
అయితే లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు విధ్వంసం మొదలుపెట్టడంతో కథ పూర్తిగా అడ్డం తిరిగింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, యువ ఆటగాడు సలీల్ అరోరా సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే.. ముంబై ఫ్యాన్స్ గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్లయింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఊదేశారుయ అంతే అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఒక్కసారిగా గర్జించారు. ముంబై ఫ్యాన్స్ తమను చేసిన ఎగతాళికి డబుల్ రివేంజ్ తీర్చుకుంటూ స్టేడియం బయట, లోపల నానా రచ్చ చేశారు.

'బాయ్ బాయ్ ముంబాయ్'.. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు!
మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియం నుంచి బయటకు వస్తున్న ముంబై అభిమానులను ఉద్దేశించి సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు "బాయ్ బాయ్ ముంబాయ్.. బాయ్ బాయ్ ముంబాయ్" అంటూ చేసిన నినాదాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. "మమ్మల్నే ఏడిపిస్తారా?" అని గర్వంగా తొడగొడుతూ హైదరాబాద్ అభిమానులు చేసిన రచ్చ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. "ఇది కదా అసలైన రివెంజ్ అంటే!" అంటూ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications