న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా కట్టడికి టీమిండియా ‘మాస్క్‌ ఫోర్స్‌’

BCCI Creates Team Mask Force, Video Features Messages From Virat Kohli, Sachin Tendulkar
#TeamMaskForce : Team India Is Now Team Mask Force

న్యూఢిల్లీ: కరోనా వైర్‌స కట్టడిలో మాస్క్ యొక్క ప్రాధాన్యత చాలానే ఉంది. అందుకే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాస్క్ వాడటం తప్పనిసరి చేశాయి. ఇప్పుడు ఎవర్ని చూసినా ముఖానికి మాస్క్‌లు ధరించే కనిపిస్తున్నారు. కానీ, ఒక్కసారిగా మెడికల్‌ మాస్క్‌ల వినియోగం అమాంతం పెరిగిపోవడంతో వీటి కొరత ఏర్పడుతోంది. నిజానికి డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికివి అత్యవసరం. మామూలు ప్రజానీకం కర్చీఫ్‌, ఇంట్లో తయారు చేసిన మాస్క్‌లు వినియోగిస్తే సరిపోతుంది.

మాస్క్‌లపై టీమిండియా అవగాహన..

అందుకే ఈ విషయంపై అవగాహన పెంచేందుకు టీమిండియా ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు కొందరు కలిసి ఓ వీడియోను రూపొందించారు. ఎవరి ఇళ్లలో వారుంటూనే ఈ వీడియోలో పాలుపంచుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని, అలాగే సొంతంగా తయారు చేసుకున్న మాస్క్‌లని వాడండంటూ ఇందులో సందేశం ఇచ్చారు.

స్టార్ క్రికెటర్లంతా..

స్టార్ క్రికెటర్లంతా..

‘ఇప్పుడు మనమంతా టీమ్‌ మాస్క్‌ ఫోర్స్‌గా ఏర్పడదాం. ఎవరి మాస్కులు వారే తయారు చేసుకుని ధరిద్దాం' అంటూ ముందుగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సందేశం ఇవ్వగా ఆ తర్వాత సొంతంగా తయారు చేసుకున్న మాస్క్‌లను ధరిస్తూ సౌరవ్‌ గంగూలీ, స్మృతి మంధాన, రోహిత్‌ శర్మ, హర్భజన్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌, రాహుల్‌ ద్రావిడ్‌, సెహ్వాగ్‌, మిథాలీ రాజ్‌ కనిపించగా ఆఖర్లో సచిన్‌తో ఈ వీడియోను ముగించారు.

మాస్క్ తయారీ చాలా సులువు..

మాస్క్ తయారీ చాలా సులువు..

‘కమాన్ ఇండియా.. సొంతంగా మాస్క్‌లు తయారు చేసుకొని మాస్క్ ఫోర్స్‌లో భాగమవుదాం. అలాగే 20 సెకండ్లపాటు చేతులు కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం మాత్రం మరచిపోవద్దు'అని సచిన్ విజ్ఞప్తి చేశాడు. ఇక ఈ మాస్క్‌ఫోర్స్‌లో భాగమవ్వడం చాలా సులువని ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇంట్లో కూర్చోని నేను తయారు చేసుకున్న మాస్క్‌లా అందరూ చేసుకోవచ్చని సూచించాడు.

బెదిరిస్తే బెదరడానికి నేనేం జైరా వసీంని కాను: బబితా ఫోగాట్

ప్రధాని టాస్క్..

ఈ వీడియోను ‘మాతో చేతులు కలపండి. కరోనాపై పోరాడండి. ఆరోగ్యసేతు మొబైల్‌ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకోండి. సురక్షితంగా ఉండండి'అనే క్యాప్షన్‌తో బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ వీడియోను రీట్వీట్ చేశారు. ఈ రోజు అందరు చేయాల్సిన అతిముఖ్యమైన టాస్క్ టీమ్ మాస్క్ ఫోర్స్‌లో భాగమవ్వడమని, జాగ్రత్తలే మనందరిని భద్రంగా ఉంచుతాయని పేర్కొన్నారు. ఈ విషయంపై అందరికి అవగాహన కల్పించాలని కోరారు.

Story first published: Sunday, April 19, 2020, 9:08 [IST]
Other articles published on Apr 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X