బెదిరిస్తే బెదరడానికి నేనేం జైరా వసీంని కాను: బబితా ఫోగాట్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరగడానికి తబ్లిగీ జమాత్ ప్రార్థనలే కారణమని భారత స్టార్ రెజ్లర్, బీజేపీ నాయకురాలు బబితా ఫోగాట్ చేసిన ట్వీట్‌తో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. బబితా విద్వేశాన్ని రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరూ ఆమె ట్విటర్ అకౌంట్‌ను సస్పెండ్ చేయాలని #SuspendBabitaPhogat అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ప్రజల ప్రేమానురాగాలు అందుకోవడానికి ఆమె ఏ మాత్రం అర్హురాలు కాదని మండిపడ్డారు.
ద్వేశానికి ఈ దేశంలో చోటులేదని, ఇలాంటి వారు రోల్‌మోడల్స్ ఎలా అవుతారని కూడా ప్రశ్నించారు. ఇంతటి విద్వేశం కలిగిన వీరి జీవితాలపై సినిమాలా? అంటూ ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. అయితే ఈ విమర్శలపై బబితా ఫోగాట్ స్పందించింది.
నేను బబితా ఫోగాట్..
ఈ బెదిరింపులకు భయపడటానికి తానేం జైరా వసీం కాదని పేర్కొంది. తానేమి తప్పుగా మాట్లాడలేదని, తన వ్యాఖ్యాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ట్విటర్ వేదికగా ఓ వీడియో ద్వారా స్పష్టం చేసింది. ‘మీరు బెదిరిస్తే బెదరడానికి నేనేం జైరా వసీంని కాను. బబితా ఫోగాట్ ఇక్కడ. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. దేశం కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.'అని బబితా ఈ వీడియోలో పేర్కొంది.
నేనేం దేశాన్ని అమ్మలేదు: కనేరియా

ప్రధాన సమస్య కరోనా కాదు..
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ దేశంలో జరిగే ప్రతిఘటనపై స్పందిస్తూ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా పంచుకునే బబితా.. బుధవారం దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను ఉద్దేశించి వరుస ట్వీట్‌లు చేసింది. దేశంలో కరోనా వైరస్ కన్నా తబ్లిగీ జమాతే ప్రార్థనలే ప్రధాన సమస్యగా మారిందని ట్వీట్ చేసింది. అంతకు మందు ఈ తబ్లిగీ జమాతే ప్రార్థనల్లో పాల్గొన్న ప్రజలు ఈ వైరస్‌ను ఇతరులకు అంటించకుంటే ఈ పాటికి దేశంలో లాక్‌డౌన్ ఎత్తేసేవారని, కరోనాను భారత్ జయించేదని పేర్కొంది.

దంగల్ బ్యూటీ జైరా..
అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో బబితా ఫోగట్ చెల్లెలు గీతా ఫోగట్ పాత్రలో జైరా వసీం నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తాను బాలీవుడ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి జైరా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయితే మతానికి సంబంధించి జైరాను చాలామంది నిందించారని, బెదిరింపులకు గురిచేశారని, ఆ కారణంగానే ఆమె బాలీవుడ్ నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించారనే ఆరోపణలున్నాయి. అయితే ఆమెను ఉదాహరణగా చెబుతూ తాను జైరా వసీంని కానని, ఎవరికీ భయపడనని బబితా ఫోగట్ పేర్కొన్నారు.

1023 కేసులు తబ్లిగీ జమాత్‌వే..
ఇక హర్యానా ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న బబితా ఫోగాట్.. దాద్రి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇక దేశంలోని 17 రాష్ట్రాలలో నమోదైన 1023 కరోనావైరస్ పాజిటివ్ కేసులకు తబ్లిగీ జమాత్ సంస్థ జరిపిన ప్రార్థనలతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన విదేశీయుల ద్వారా వైరస్ మిగతా వారికి సోకిందని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications