న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Zimbabwe:లక్కీ చాన్స్ కొట్టేసిన ఆ ఆర్‌సీబీ స్పిన్నర్!

 BCCI announce Shahbaz Ahmed replaces injured Washington Sundar for Zimbabwe series

న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ లక్కీ చాన్స్ కొట్టేసాడు. భుజ గాయంతో జింబాబ్వే పర్యటన నుంచి అర్థాంతరంగా తప్పుకున్న వాషింగ్టన్ సుందర్ స్థానంలో భారత జట్టు పిలుపును అందుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన కౌంటీ క్రికెట్‌లో గాయపడ్డ సుందర్ జింబాబ్వే పర్యటన నుంచి తప్పుకున్నాడని తెలిపింది.

వాస్తవానికి సుందర్ గతేడాదిగా గాయాలతో సావాసం చేస్తున్నాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో చేతి వేలి గాయానికి గురైన సుందర్.. డొమెస్టిక్ సీజన్‌తో పాటు ఈ ఏడాది జనవరిలో సౌతాఫ్రికాతో సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. తర్వాత కొవిడ్ బారినపడి కోలుకున్నాడు. ఆ తర్వాత కాలిపిక్క కండరాల గాయంతో ఫిబ్రవరి, మార్చిలో వెస్టిండీస్, శ్రీలకంతో సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇక ఐపీఎల్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఆడలేదు. రిహాబిలిటేషన్ తర్వాత బీసీసీఐ పర్మిషన్‌తో కౌంటీల్లో ఆడాడు. అక్కడ సత్తా చాటి చివరకు టీమ్‌లోకి వచ్చే టైమ్‌లో మళ్లీ భుజం గాయంతో వెనక్కి వచ్చేస్తున్నాడు.

ఇక సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్ జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన షాబాజ్ అహ్మద్, 29 మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 19 ఇన్నింగ్స్‌ల్లో 279 పరుగులు చేశాడు. లిస్టు ఏ క్రికెట్‌లో 21 మ్యాచులు ఆడి ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో 435 పరుగులు చేసిన షాబాజ్ అహ్మద్, 39.54 సగటుతో పరుగులు చేశాడు. 18 వికెట్లు తీసిన షాబాజ్ అహ్మద్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో కూడా షాబాజ్ సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతోనే టీమిండియా పిలుపును అందుకున్నాడు.

ఆగస్టు 18 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్‌లో మూడు మ్యాచులు కూడా జింబాబ్వేలోని హారారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతాయి. ఆగస్టు 18న తొలి వన్డే, ఆగస్టు 20న రెండో వన్డే, 22న మూడో వన్డే జరుగుతాయి. ఈ మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30కి ప్రారంభమవుతాయి...

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌కి భారత జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహార్, షాబాజ్ అహ్మద్

Story first published: Tuesday, August 16, 2022, 15:30 [IST]
Other articles published on Aug 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X