న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs RR: నవదీప్ సైనీ డేంజరస్ బీమర్.. చాతికి తగిలి నేలకూలిన రాజస్థాన్ బ్యాట్స్‌మన్! (వీడియో)

Ball slips out of RCB’s Navdeep Saini’s hands and hits RR batsman Rahul Tewatia on chest

అబుదాబి: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో నవ్‌దీప్ సైనీ విసిరిన డేంజరెస్ బీమర్.. నేరుగా తెవాటియా చాతికి తాగిలింది. ఈ దెబ్బకు అతను నేల కూలాడు. దాంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు టీవీ ముందున్న ప్రేక్షకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పిజియోలు హుటాహుటిన మైదానంలోకి వచ్చి తెవాటియాకు ప్రథమ చికిత్స అందించారు.

ఇంతకేం జరిగిందంటే..

రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతి సైనీ చేతిలో నుంచి జారి హైయర్ ఫుల్ టాస్‌‌గా 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈ బంతిని తెవాటియా స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతను వేగంగా బ్యాట్‌ను ఊపడంతో బంతి నేరుగా వచ్చి అతని చాతిని తగిలింది. దీంతో నొప్పితో విలవిలాడిన తెవాటియా ఒక్కసారిగా మైదానంలో కూలిపోయాడు. ఈ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించగా.. ఫ్రీహిట్‌ను తెవాటియా భారీ సిక్సర్ కొట్టి తన గాయం మాములేనని తెలియజేశాడు. అనంతరం మరో భారీ సిక్సర్ కొట్టడంతో ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి.

మహిపాల్ ఒక్కడే..

మహిపాల్ ఒక్కడే..

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్ చేసింది. కొత్తగా జట్టులోకి వచ్చిన కుర్రాడు మహిపాల్ లోమ్‌రోర్(39 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 47)రాణించగా.. చివర్లో ఆర్చర్(16 నాటౌట్), రాహుల్ తెవాటియా(24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆర్‌సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/24) మూడు వికెట్లతో చెలరేగగా.. ఇసురు ఉడానా(2/41) రెండు వికెట్లు తీసాడు. సైనీకి ఒక వికెట్ దక్కింది.

కోహ్లీ, పడిక్కల్ హాఫ్ సెంచరీ..

కోహ్లీ, పడిక్కల్ హాఫ్ సెంచరీ..

అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 158 పరుగులు చేసి 5 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఓపెనర్ దేవ్‌దూత్ పడిక్కల్(45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 63) తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ సీజన్‌లో పడిక్కల్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. ఇక రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్ చెరొక వికెట్ తీశారు.

అంతా 2020 మహత్యం.. ఎన్నడు లేనిది కేన్ మామ కోప్పడడం ఏంది?

Story first published: Saturday, October 3, 2020, 20:23 [IST]
Other articles published on Oct 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X