న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో కన్నా టెస్టుల్లోనే బెస్ట్‌.. సెహ్వాగ్‌ మాటలు గుర్తు చేసుకున్న వార్నర్!!

David Warner Recalls Virender Sehwag's Tip On Test Cricket || Oneindia Telugu
Australia vs Pakistan: David Warner recalled Virender Sehwags advice after triple hundred in Adelaide

ఆడిలైడ్‌: గతంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్న మాటలను ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ శనివారం గుర్తుచేసుకున్నాడు. టీ20 బ్యాట్స్‌మన్‌ కన్నా టెస్టు బ్యాట్స్‌మన్‌గానే తాను బాగా రాణిస్తానని సెహ్వాగ్‌ అన్నట్లు వార్నర్‌ చెప్పాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న డేనైట్‌ టెస్టులో వార్నర్‌ (335 నాటౌట్‌; 418 బంతుల్లో 39x4, 1x6) ట్రిపుల్‌ సెంచరీ చేసాడు. దీంతో ఆస్ట్రేలియా 589/3 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ప్రస్తుతం ఆసీస్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఫాలోఆన్‌ ఆడుతున్న పాక్.. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ స్కోర్ కంటే ఇంకా 250 పరుగులు వెనకబడి ఉంది.

'అసాధ్యమేమీ కాదు.. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌-4 మా లక్ష్యం''అసాధ్యమేమీ కాదు.. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌-4 మా లక్ష్యం'

టీ20ల్లో కన్నా టెస్టుల్లోనే బెస్ట్‌:

టీ20ల్లో కన్నా టెస్టుల్లోనే బెస్ట్‌:

శనివారం మ్యాచ్‌ అనంతరం వార్నర్ మీడియాతో మాట్లాడుతూ... ఐపీఎల్‌లో ఆడుతున్నప్పుడు సెహ్వాగ్‌ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. 'గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఆడుతున్నప్పుడు సెహ్వాగ్‌ నాతో ఒకసారి మాట్లాడాడు. టీ20ల్లో కన్నా టెస్టుల్లోనే బాగా రాణిస్తానని అన్నాడు. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారని.. నేను ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఎక్కువగా ఆడలేదని సమాధానం ఇచ్చా' అని పేర్కొన్నాడు.

 నా మెదడులో అదే పాతుకుపోయింది:

నా మెదడులో అదే పాతుకుపోయింది:

'టెస్టుల్లో స్లిప్, గల్లీలో ఫీల్డర్లు ఉంటారు. మిడ్‌ వికెట్‌, మిడ్‌ ఆఫ్‌, మిడ్‌ ఆన్‌లో కూడా ఉంటారు. వాళ్లపై నుంచి ఆడుతూ రోజంతా బ్యాటింగ్‌ చేయోచ్చు అని సెహ్వాగ్‌ అన్నాడు. ఆ విషయం వినడానికి చాలా తేలిగ్గా అనిపించింది. అయితే నా మెదడులో అదే విషయం పాతుకుపోయింది' అని వార్నర్‌ తెలిపాడు.

యాషెస్‌లో విఫలం:

యాషెస్‌లో విఫలం:

బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొన్న వార్నర్ ఐపీఎల్-2019 ద్వారా రి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ పరుగుల వరద పారించినా.. యాషెస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన 5 మ్యాచ్‌ల్లో మొత్తం 95 పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. అయితే తాజాగా పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మాత్రం చెలరేగుతున్నాడు. తొలి టెస్టులో 154 పరుగులు చేసిన వార్నర్.. రెండో టెస్టులో ట్రిపుల్‌ సెంచరీ చేసాడు.

డేవిడ్‌ వార్నర్‌ 335 నాటౌట్‌.. ఆసీస్ ఇన్నింగ్స్‌ ఎందుకు డిక్లేర్‌ చేసిందంటే?!!

టెస్టుల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు:

టెస్టుల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు:

డే/నైట్‌ టెస్టుల్లో అజహర్‌ అలీ (302 నాటౌట్‌; విండీస్‌పై దుబాయ్‌లో 2016లో) తర్వాత ట్రిపుల్‌ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. మాథ్యూ హేడెన్‌ (380; జింబాబ్వేపై 2003లో పెర్త్‌లో) తర్వాత ఆసీస్‌ తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరును వార్నర్‌ నమోదు చేసాడు. ఆసీస్‌ తరఫున టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఏడో క్రికెటర్‌గా కూడా వార్నర్‌ నిలిచాడు.

Story first published: Sunday, December 1, 2019, 15:48 [IST]
Other articles published on Dec 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X