న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డేవిడ్‌ వార్నర్‌ 335 నాటౌట్‌.. ఆసీస్ ఇన్నింగ్స్‌ ఎందుకు డిక్లేర్‌ చేసిందంటే?!!

Australia vs Pakistan: David Warner triple century: Why Tim Paine declared Australian innings with Warner at 335*

అడిలైడ్‌: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. విజయంపై ఆసీస్ నమ్మకంగా ఉంది. ఇక ఆస్ట్రేలియా 589/3 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. టెస్ట్ ఫార్మాట్‌లో విండీస్‌ దిగ్గజం బ్రయాన్‌ లారా (400) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును.. ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ (335 నాటౌట్‌; 418 బంతుల్లో 39x4, 1x6) అధిగమించే అవకాశం ఉన్నా కెప్టెన్‌ టిమ్‌పైన్‌ శనివారం ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసాడు. ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడం వెనక ఉన్న అసలు కారణాన్ని వార్నర్ తెలిపాడు.

'దురుద్దేశంతోనే రవిశాస్త్రిపై ట్రోలింగ్‌.. అవేమి ఆయనపై ప్రభావం చూపవు''దురుద్దేశంతోనే రవిశాస్త్రిపై ట్రోలింగ్‌.. అవేమి ఆయనపై ప్రభావం చూపవు'

 బౌలింగ్‌ చేయడానికి ఎక్కువ సమయం కావాలనుకున్నాం:

బౌలింగ్‌ చేయడానికి ఎక్కువ సమయం కావాలనుకున్నాం:

శనివారం మ్యాచ్ అనంతరం వార్నర్‌ మీడియాతో మాట్లాడుతూ... 'ఆదివారం నాటి మూడో రోజు వాతావరణాన్ని పరిశీలించాం. ఆసీస్ జట్టు బౌలింగ్‌ చేయడానికి ఎక్కువ సమయం కావాలనుకున్నాం. ఒకవేళ రేపు వర్షం పడే అవకాశం ఉంటే.. మా బౌలర్లకు తగిన విశ్రాంతి లభిస్తుంది. అప్పుడు రెండు రోజుల్లో 14 వికెట్లు పడగొడితే సరిపోతుంది' అని అన్నాడు.

డిక్లేర్‌ విషయంపై చర్చించా:

డిక్లేర్‌ విషయంపై చర్చించా:

'రెండో రోజు నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు మొదటగా స్టీవ్‌ స్మిత్‌తో డిక్లేర్‌ విషయంపై చర్చించా. పాకిస్థాన్‌కు ఈరోజు మనం ఎన్ని ఓవర్లు బౌలింగ్‌ చేస్తామని అడిగా. తగినంత సమయం ఉందని చెప్పాడు. టీ విరామ సమయంలో ఇన్నింగ్స్‌ ఎప్పుడు డిక్లేర్‌ చేస్తున్నారని జట్టును అడిగా. 5:40 అని చెప్పారు. తర్వాత ఆ సమయం మించిపోయాక.. కెప్టెన్‌ నన్ను డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డును (334) అధిగమించమని చెప్పాడు. అది చేశా' అని వార్నర్‌ పేర్కొన్నాడు.

కెప్టెన్‌ నిర్ణయం సరైందే:

కెప్టెన్‌ నిర్ణయం సరైందే:

'టెస్టు రికార్డులపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఆ ఘనతలు తెలుసుకునే ఎదుగుతాం. బ్రాడ్‌మన్‌ గురించి ఎప్పుడు మాట్లాడినా.. చరిత్ర పుటల్లో కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. ఆ మైలురాళ్లను వారెలా చేరుకున్నారనే విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈరోజు ట్రిపుల్ సాధించడం ఆనందంగా ఉంది' అని వార్నర్‌ చెప్పాడు. అడిలైడ్‌లో రాబోయే రెండు రోజుల్లో వర్షం కురిసే అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ కెప్టెన్‌ నిర్ణయం సరైందేనని అందరూ ప్రశంసిస్తున్నారు.

ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఏడో క్రికెటర్‌:

ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఏడో క్రికెటర్‌:

డే/నైట్‌ టెస్టుల్లో అజహర్‌ అలీ (302 నాటౌట్‌; విండీస్‌పై దుబాయ్‌లో 2016లో) తర్వాత ట్రిపుల్‌ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. మాథ్యూ హేడెన్‌ (380; జింబాబ్వేపై 2003లో పెర్త్‌లో) తర్వాత ఆసీస్‌ తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరును వార్నర్‌ నమోదు చేసాడు. ఆసీస్‌ తరఫున టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఏడో క్రికెటర్‌గా కూడా వార్నర్‌ నిలిచాడు.

Story first published: Sunday, December 1, 2019, 15:19 [IST]
Other articles published on Dec 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X