1st Odi: ఇండియా VS ఆస్ట్రేలియా ప్రివ్యూ , కోహ్లీ కీలక నిర్ణయం!

ముంబై: శ్రీలంకతో టీ20 సిరీస్ గెలిచి ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించిన టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్ధమైంది. మంగళవారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై పట్టు కోసం ఇరు జట్లు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బలబలాల విషయంలో ఇరు జట్లు సమంగానే ఉన్నప్పటికీ.. సొంతగడ్డపై జరుగుతుండటం కోహ్లీసేనకు అడ్వాంటేజ్. అయితే గతేడాది ఆసీస్ చేతిలో ఎదురైన పరాభావానికి ఇండియా బదులు తీర్చుకోవాలనుకుంటుంది. అంతేకాకుండా టీ20 వరల్డ్‌కప్‌కు మందు జరుగుతున్న సిరీస్ కావడంతో మిడిలార్డర్‌ను పటిష్టం చేసుకోవాలనుకుంటుంది.

కోహ్లీసేన ప్రతీకారం తీర్చుకునేనా?

ఆ ముగ్గురు బరిలో..

శిఖర్ ధావన్ గైర్హాజరీతో అతని స్థానంలో ఓపెనర్ గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రోహిత్ విశ్రాంతి సమయంలో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ధావన్ అదరగొట్టాడు. అయితే ఈ ముగ్గురిలో ఎవరిని ఓపెనర్లుగా బరిలోకి దించాలనే విషయం టీమ్ మేనేజ్ మెంట్ కు తలనొప్పిగా మారింది. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాటలను చూస్తే.. ఈ ముగ్గురు బరిలో దిగే అవకాశం ఉంది. రోహిత్-ధావన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే రాహుల్ మూడో స్థానంలో రానున్నాడు. కోహ్లీ నాలుగో స్థానంలో, శ్రేయస్ ఐదో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను పక్కనపెట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేఎల్ రాహుల్ కీపింగ్ చేయనున్నాడు. కేదార్ జాదవ్, శివం ధూబేలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. జాదవ్ ఈ సిరీస్‌లో రాణించకపోతే... న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికవ్వడం కష్టమే.

పటిష్టంగానే బౌలింగ్..

జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ నేత`త్వంలో ఇండియా బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. అయితే గాయం నుంచి కోలుకున్న బుమ్రా తన మార్క్ పెర్ఫామెన్స్ బాకీ ఉన్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న షమీ కూడా చెలరేగితే భారత బౌలింగ్‌కు తిరుగుండదు. కుల్దీప్ కూడా విండీస్ టూర్‌లో హ్యాట్రిక్‌తో చెలరేగాడు. పిచ్ ద`ష్ట్యా రవీంద్ర జడేజాకు చాన్స్ దక్కవచ్చు. ఇటీవల బ్యాటింగ్‌లో చెలరేగుతున్న శార్దుల్ ఠాకుర్‌ తుది జట్టులో ఉండొచ్చు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో రాణించిన యువ బౌలర్ నవ్‌దీప్ సైనీనీ తీసుకుంటారా? లేక అనుభవం ద`ష్ట్యా షమీకి అవకాశం ఇస్తారానేది చూడాలి.

తొలి వన్డే.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్‌-ధావన్‌!!

బలంగా ఆస్ట్రేలియా..

బలంగా ఆస్ట్రేలియా..

ఇటీవల సొంతగడ్డపై జరిగిన సిరీస్‌ల్లో ఓటమెరుగని ఆసీస్.. బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా ఉంది. ఇక నిలకడకే మారుపేరుగా రాణిస్తున్న మార్నస్ లబుషేన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అరంగేట్రం చేస్తుండటం సిరీస్‌పై అంచనాలను పెంచుతున్నాయి. మరోవైపు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్మిత్‌లు.. ఇంకోవైపు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హజల్ వుడ్‌లతో ఆ జట్టు దుర్భేధ్యంగా ఉంది. మొత్తానికి పండుగపూట జరుగుతున్న ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజానివ్వనుంది. ఇక సంక్రాంతి బరిలో నెగ్గే జట్టేదో చూడాలి. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

టాస్ కీలకం..

టాస్ కీలకం..

వాంఖడే పిచ్‌లో మంచు ప్రభావం ఎక్కువ. ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు. పిచ్ ద`ష్ట్యా మణికట్టు బౌలర్లకు అవకాశం దక్కకపోవచ్చు.

తుది జట్ల అంచనా :

భారత్: శిఖర్ ధావన్, రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శార్ధుల్ ఠాకుర్, కుల్దీప్, షమీ/సైనీ, బుమ్రా

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్ , ఫించ్, స్మిత్, లబుషేన్, హ్యాండ్ స్కోంబ్, అలెక్స్ క్యారీ, అష్టోన్ అగర్, కమిన్స్, స్టార్క్, హజల్ వుడ్, జంపా

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, January 13, 2020, 20:17 [IST]
Other articles published on Jan 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X