న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2022: భారత్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్.. 10 శాతం పెరిగిన పాక్ ఆటగాళ్ల జీతాలు!

Asia Cup 2022: Pakistan cricket team salaries increase before Mega clash vs India

హైదరాబాద్: ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరగనున్న హైఓల్డేజ్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. వార్షిక వేతనాలను 10 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. నెదర్లాండ్స్ పర్యటనకు ముందు కొత్త కాంట్రాక్టులు ప్రకటించిన పీసీబీ ఇప్పుడు వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఇచ్చిన జీతాల కంటే 10 శాతం ఎక్కువగా ఇవ్వనున్నారు. మొత్తం 33 మంది పాకిస్థాన్ ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్టులు కలిగి ఉండగా.. పెంచిన జీతాల ప్రకారం ఆటగాళ్లందరికి ఓ టెస్ట్ మ్యాచ్ ఫీజు కింద రూ.3 లక్షల 20 వేల రూపాయిలు, వన్డే మ్యాచ్‌కు రూ.లక్షా 83 వేలు, టీ20 మ్యాచ్‌కు రూ. లక్షా 35 వేల రూపాయిలు ఇవ్వనున్నారు.

నెలకు రూ. 3 లక్షలే..

నెలకు రూ. 3 లక్షలే..

ఇక పాకిస్థాన్‌ సెంట్రల్ కాంట్రాక్టులను రెండు భాగాలుగా విభజించింది. రెడ్ బాల్ కాంట్రాక్ట్, వైట్ బాల్ కాంట్రాక్ట్‌గా వార్షిక వేతనాలను అందిస్తుంది. రెడ్ బాల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లకు నెలకు రూ.3 లక్షల 74వేల వేతనం అందివ్వనున్నారు. వైట్ బాల్ క్రికెట్ కాంట్రాక్టర్లకు రూ. 3 లక్షల 42 వేలు ఇవ్వనున్నారు. సపోర్టింగ్ స్టాఫ్ మ్యాచ్ ఫీజులను 50 నుంచి 70 శాతం పెంచారు. ఇక రెండు కాంట్రాక్టుల్లో ఉన్నపాకిస్థాన్ ఆటగాళ్లకు లభించే వేతనం.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో సీ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్ల వేతనంతో సమానం.

భారత్‌ ఆటగాళ్ల జీతాల్లో సగం కూడా...

భారత్‌ ఆటగాళ్ల జీతాల్లో సగం కూడా...

భారత సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకారం ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్లు, ఏ గ్రేడ్ ప్లేయర్స్‌కు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, సీ గ్రేడ్ ప్లేయర్లకు కోటీ రూపాయాల వార్షిక వేతనం అందుతుంది. ఇక మ్యాచ్‌ ఫీజులు టెస్ట్‌లకు రూ.15 లక్షలు, వన్డేలకు 6 లక్షలు, టీ20లకు రూ.3లక్షలు ఇస్తున్నారు. ఆటగాళ్లు సెంచరీ చేసినా లేదా 5 వికెట్లు తీసినా మరో రూ.5 లక్షలు బోనస్‌గా అందజేస్తున్నారు. డబుల్ సెంచరీ చేస్తే రూ.7లక్షలు ఇస్తున్నారు. ఏ విషయంలోనూ పాక్ ఆటగాళ్ల జీతాలు భారత్ కంటే మెరుగ్గా లేవు.

అన్యాయం... కెప్టెన్సీ మార్పు పట్ల నెటిజన్ల విమర్శలు *Cricket | Telugu OneIndia
టాప్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్ల జీతాలు..

టాప్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్ల జీతాలు..

ఇంగ్లండ్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు గమనిస్తే..మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లకు రూ. 9.8 కోట్లు, కేవలం టెస్ట్‌లు మాత్రమే ఆడే వారికి రూ.6.7 కోట్లు, లిమిటెడ్ ఫార్మాట్ ప్లేయర్లకు రూ.3.1 కోట్లను వార్షిక వేతనంగా అందజేస్తున్నారు. మ్యాచ్ ఫీజులు.. టెస్ట్‌లకు రూ.18.5 లక్షలు, వన్డేలు 10 లక్షలు, టీ20లకు రూ.5.1 లక్షలు ఇస్తున్నారు. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌కు కెప్టెన్‌కు 25 శాతం బోనస్‌గా సాలరీ అందుతుంది.

Story first published: Friday, August 12, 2022, 9:39 [IST]
Other articles published on Aug 12, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X