న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2022: పాపం.. కోహ్లీ, రాహుల్ రీఎంట్రీతో మిడిలార్డర్‌లో బలయ్యేదెవరో..?

 Asia Cup 2022: If Rahul opens, Kohli plays at No. 3, who to drop from middle order?

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం అనంతరం ఆసియాకప్‌లో బరిలోకి దిగనున్నాడు. ఇటీవల అతను పేలవ ఫామ్ కనబరుస్తుండటంతో తుది జట్టు అతని‌‌ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఓ ఏడాది కిందటి వరకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహకు కూడా అందలేదు. కానీ ఇప్పుడు.. అతను తుది జట్టులో ఉంటాడా? లేదా? అన్న అంశం క్రికెట్‌‌‌‌ వర్గాల్లో హాట్‌‌‌‌ టాపిక్‌‌‌‌గా నిలుస్తున్నది. గత దశాబ్ద కాలంలో ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో విరాట్‌‌‌‌ లేకుండా ఆడిన మ్యాచ్‌‌‌‌లే లేవు. కానీ ఇప్పుడు.. అతన్ని తీసుకుంటే మిడిలార్డర్‌‌‌‌లో ఎవరిపై వేటు వేయాలనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌కు టైమ్‌‌‌‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో... టీమ్‌‌‌‌ సమీకరణాల్లో సెలెక్టర్లు ఎలాంటి మార్పులు చేయబోతున్నారు. అవి ఎవరిపై ప్రభావం చూపిస్తాయనేది ఉత్కంఠగా మారింది.

ఒక్క ప్లేస్‌కు ముగ్గురు పోటీ..

ఒక్క ప్లేస్‌కు ముగ్గురు పోటీ..

గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి టోర్నీ కోసం బీసీసీఐ భారీ ప్లాన్స్‌‌‌‌ వేస్తోంది. బలమైన జట్టును బరిలోకి దించాలని లక్ష్యం‌‌‌గా పెట్టుకుంది. అందులో భాగంగా కుర్రాళ్లతో చేసిన ప్రతి ప్రయోగం సక్సెస్‌‌‌‌ కావడంతో ఇప్పుడు టీమ్‌‌‌‌లో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో టాప్‌‌‌‌-3లో రోహిత్‌‌‌‌, రాహుల్‌‌‌‌, కోహ్లీ కామన్‌‌‌‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు రాహుల్‌‌‌‌తో పాటు విరాట్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో లేడు.

వేటు పడేది ఎవరిపైనో..?

వేటు పడేది ఎవరిపైనో..?

మరి ఈ క్లిష్ట సమయంలో ఈ ఇద్దర్ని తప్పించే ధైర్యం సెలెక్షన్‌‌‌‌ కమిటీ చేస్తుందా? ఒకవేళ ఈ ఇద్దర్ని కొనసాగిస్తే మిడిలార్డర్‌‌‌‌లో ఎవరిపై వేటు వేస్తారన్నది మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రస్తుతం రిషభ్‌‌‌ పంత్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌ యాదవ్‌, దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌తో మిడిలార్డర్‌‌‌‌ చాలా బలంగా ఉంది. టీమిండియాకు పంత్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ ఫ్యాక్టర్‌‌‌‌ అనేది కాదనలేని నిజం. సూర్య 360 డిగ్రీస్‌‌‌‌ హిట్టర్‌‌‌‌. కార్తీక్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఫినిషర్‌‌‌‌. ఐపీఎల్‌‌‌‌తో పాటు ఇటీవల ఆడిన సిరీస్‌‌‌‌ల్లో వీళ్లు తమ సత్తాను నిరూపించుకున్నారు.

 కార్తీక్‌కు నిరీక్షణ తప్పదు..

కార్తీక్‌కు నిరీక్షణ తప్పదు..

మరి రాహుల్‌‌‌‌, విరాట్‌‌‌‌ను కొనసాగించాల్సి వస్తే ఈ ముగ్గురిలో ఎవర్ని తొలగిస్తారు? దీనికి కచ్చితమైన సమాధానం సెలెక్షన్‌‌‌‌ కమిటీ వద్ద ఉందా? అన్నది తేలాలి. ఆల్‌‌‌‌రౌండర్లుగా హార్దిక్‌‌‌‌, జడేజా ప్లేస్‌‌‌‌లు ఖాయం. వీళ్లపై ఎలాంటి చర్చ అవసరం లేదు. లైనప్‌‌‌‌లో కనీసం నలుగురు స్పెషలిస్ట్‌‌‌‌ బౌలర్లు అవసరం కాబట్టి.. ఈ ఇద్దర్ని తీసే అవకాశం‌‌‌ లేదు. ఐదుగురు స్పెషలిస్ట్‌‌‌‌ బ్యాటర్ల ఎంపికనే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాహుల్, కోహ్లీ రాకలతో దినేశ్ కార్తీక్, సూర్య స్థానాలకు ఎసరొచ్చింది. కార్తీక్‌ను పక్కనపెట్టడం ఖాయమని తెలుస్తున్నా.. సూర్యను తప్పించే సాహసం రోహిత్ చేయకపోవచ్చు.

T20 ప్రపంచకప్‌కు వాళ్లిద్దరూ దూరం,మరెలా? *Cricket | Telugu OneIndia
విరాట్‌‌‌‌‌కు అగ్ని పరీక్ష..

విరాట్‌‌‌‌‌కు అగ్ని పరీక్ష..

గతేడాది టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ తర్వాత.. 9 నెలల్లో కోహ్లీ 4 టీ20 మ్యాచ్‌‌‌‌లే ఆడాడు. అందులో 17, 52, 1, 11 స్కోర్లు మాత్రమే చేశాడు. కోహ్లీ స్థాయికి ఇవి చాలా తక్కువ స్కోర్లు. దాంతో, రాబోయే ఆసియా కప్​లో అతని ప్రదర్శన​పై అందరి ఫోకస్​ ఉన్నది. నెమ్మదిగా ఇన్నింగ్స్​ మొదలు పెట్టే విరాట్​ క్రీజులో కుదురుకోగానే వికెట్​ పారేసుకుంటున్నాడు. మరోవైపు ఈ ఫార్మాట్​లో భారత్ మొదటి బాల్​ నుంచే ఎదురుదాడి చేస్తోంది.

ఈ పంథాలో ఆడి ఇంగ్లండ్​, విండీస్​లో సక్సెస్​ కూడా అయ్యింది. కాబట్టి కోహ్లీ తనలోని చాంపియన్​ బ్యాటర్​ను తక్షణమే నిద్రలేపాల్సి ఉంటుంది. ఇప్పటికే అతని కోసం నిలకడగా ఆడుతున్న ప్లేయర్లను తప్పించాల్సి వస్తోంది. ఆసియాకప్​లోనూ ఫెయిలైతే మాత్రం కోహ్లీ టీ20 వరల్డ్​ కప్​నకు దూరమైనా ఆశ్చర్యం లేదు.

Story first published: Saturday, August 13, 2022, 11:19 [IST]
Other articles published on Aug 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X