న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ అంటేనే గూజ్‌బంప్స్ వస్తాయి: ఆండ్రూ రసెల్

Andre Russell Says He Wants to Play his Last IPL Season in KKR Jersey

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఆండ్రూ రసెల్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై తన ఇష్టాన్ని చాటుకున్నాడు. మిగతా లీగ్‌లతో పోలిస్తే ఐపీఎల్‌ ఆడే సందర్భంలోనే తనకు(గూజ్‌బంప్స్) రోమాలు నిక్కబొడుచుకుంటాయని తెలిపాడు. ఐపీఎల్‌లో తన చివరి మ్యాచ్‌ వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టుతోనే ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. తన ఆఖరీ ఐపీఎల్ మ్యాచ్ కూడా కోల్‌కతా వేదికగానే జరగాలని ఆదివారం కేకేఆర్ ఫ్రాంచైజికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఫ్యాన్స్ చూపించే ప్రేమ..

ఫ్యాన్స్ చూపించే ప్రేమ..

‘నేను మీ ముందు ఒక్కటి అంగీకరించాలి. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) కన్నా కూడా ఐపీఎల్‌ సమయంలోనే నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ముఖ్యంగా ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆడేటపుడు భావోద్వేగాలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఆ మైదానంలో ఆడిన మ్యాచ్‌ల‌ను వేరే వాటితో పోల్చలేం. ఈడెన్‌లో లభించే స్వాగతం, ఫ్యాన్స్ చూపించే ప్రేమ చాలా ఒత్తిడి పెంచుతుంది. అయితే అది చాలా సానుకూలమైనది.

విఫలమైనా.. అదే అభిమానం..

విఫలమైనా.. అదే అభిమానం..

గత ఆరు సీజన్లుగా కోల్‌కతాకే ప్రాతినిధ్యం వహిస్తున్నా. అక్కడి అభిమానుల ప్రేమ అనిర్వచనీయం. నేను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా... మూడో మ్యాచ్‌కు వారు నన్ను అదే రీతిలో స్వాగతిస్తారు. అందుకే నా చివరి మ్యాచ్‌ వరకు కేకేఆర్‌ జట్టుకే ఆడతా.' అని రసెల్‌ వివరించాడు.

విఫలమైనా.. అదే అభిమానం..

విఫలమైనా.. అదే అభిమానం..

గత ఆరు సీజన్లుగా కోల్‌కతాకే ప్రాతినిధ్యం వహిస్తున్నా. అక్కడి అభిమానుల ప్రేమ అనిర్వచనీయం. నేను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా... మూడో మ్యాచ్‌కు వారు నన్ను అదే రీతిలో స్వాగతిస్తారు. అందుకే నా చివరి మ్యాచ్‌ వరకు కేకేఆర్‌ జట్టుకే ఆడతా.' అని రసెల్‌ వివరించాడు. ఇక లీగ్‌లో ఫ్రాంచైజీ తరఫున చివరి మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు కేకేఆర్ ఫ్రాంచైజీలో ప్రతీ ఒక్కరికి తెలియజేస్తానన్నాడు. ‘షారూఖ్.. కేకేఆర్ స్టాఫ్ అందరూ వినండి. ఇది నా చివరి ఐపీఎల్ మ్యాచ్, కోల్‌కతాలో ఆడుతున్న చివరి హోమ్ గేమ్ ఇదే'అని అందరికి నేనే స్వయంగా చెప్తానని రసెల్ తెలిపాడు.

ఫ్యామిలీకి దూరంగా..

ఫ్యామిలీకి దూరంగా..

ఐపీఎల్ 2020 సీజన్ ఈ ఏడాదిలో ఏదో ఒక టైమ్‌లో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ వల్ల రసెల్ తన భార్య, ఇటీవల పుట్టిన కూతురుకు దూరంగా ఉంటున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఈ విండీస్ వీరుడు 510 పరుగులతో పాటు 11 వికెట్ల పడగొట్టాడు. కానీ కేకేఆర్ మాత్రం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది.

ఆ రోజు ధోనీ లేకుంటే రోహిత్ ఉండేవాడు కాదు: గంభీర్

Story first published: Monday, May 4, 2020, 9:07 [IST]
Other articles published on May 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X