For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ రోజు ధోనీ లేకుంటే రోహిత్ ఉండేవాడు కాదు: గంభీర్

Gautam Gambhir Says MS Dhoni deserves a lot of credit for Rohit Sharmas success
Rohit Sharma's success Credit Goes To MS Dhoni: Gautam Gambhir

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సక్స్‌స్ క్రెడిట్ ధోనీదేనని, అతని నాయకత్వ ప్రతిభతోనే హిట్‌మ్యాన్ ప్రపంచ క్రికెట్‌కు పరిచయమయ్యాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఈ రోజు రోహిత్ ఉన్న స్థానం, అతనికి అందుతున్న ప్రశంసలన్నీ మహీ వల్లనేనని, ఆనాడు ధోనీ లేకుంటే.. ఈ రోజు హిట్‌మ్యాన్ అనేవాడు ఉండేవాడు కాదన్నాడు.

కెరీర్ ప్రారంభంలో విఫలమైన..

కెరీర్ ప్రారంభంలో విఫలమైన..

ఇక కెరీర్ ప్రారంభంలో మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్‌ నిలకడలేమి ఫామ్‌తో సతమతమయ్యాడు. 2007 టీ20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ ముంబై క్రికెటర్.. 2013 దాకా జట్టు స్థిరంగా ఉండలేకపోయాడు. సచిన్ రిటైర్మెంట్ అనంతరం.. రోహిత్ నైపుణ్యాన్ని పసిగట్టిన ధోనీ ఓపెనర్‌గా ప్రమోట్ చేశాడు. సెలెక్టర్లు, కోచ్‌లు కాదన్నా.. రోహిత్‌పై నమ్మకంతో ధోనీ అతనికి ఓపెనర్‌గా అవకాశం ఇచ్చాడు. ఇక తన సత్తా ఎంటో నిరూపించిన హిట్‌మ్యాన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుదిరిగింది లేదు.

రోహిత్ సక్సెస్ క్రెడిట్ మహీదే..

రోహిత్ సక్సెస్ క్రెడిట్ మహీదే..

శనివారం ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడిన గంభీర్.. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మహీ కెప్టెన్సీని కొనియాడాడు. రోహిత్ సక్సెస్ క్రెడిట్ అందుకోవడానికి ధోనీ అన్ని విధాల అర్హుడని అభిప్రాయపడ్డాడు.

‘నాకు తెలిసి ఈ రోజు రోహిత్ శర్మ ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం ఎంఎస్ ధోనీనే. సెలెక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ వద్దన్నా కెప్టెన్‌గా ధోనీ మాత్రం రోహిత్‌కు అండగా నిలిచాడు. ఆ మద్దతును చాలా రోజులు కొనసాగించాడు. రోహిత్ సక్సెస్ క్రెడిట్ అందుకోవడానికి ధోనీ అన్ని విధాల అర్హుడు. చాలా మంది ప్లేయర్లకు అలాంటి కెప్టెన్ మద్దతు దొరకదు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

రాణించకున్నా అండగా నిలిచాడు..

రాణించకున్నా అండగా నిలిచాడు..

‘కెరీర్ ప్రారంభంలో రోహిత్ రాణించకున్నా.. అతన్ని ధోనీ పక్కనపెట్టలేదు. దీంతోనే మహీ మంచి గుణం అందరికి తెలిసింది. రోహిత్ శర్మకు జట్టు మొత్తం అనుకూలంగా లేకున్నా.. ప్రతీ టూర్‌కు సంబంధించిన సెలెక్షన్ మీటింగ్‌లో అతని పేరు చర్చకు వచ్చేది. ధోనీ కూడా రోహిత్‌నే తీసుకుంటామని చెప్పేవాడు. దీంతో అతన్ని ఎప్పుడూ పక్కనపెట్టేవారు కాదు. మహీ ఎప్పుడూ రోహిత్ టాలెంట్‌నే చూసేవాడు. అతని సక్సెస్ క్రెడిట్ ధోనీదే'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

మూడు డబుల్ సెంచరీలు..

మూడు డబుల్ సెంచరీలు..

ఇక మహీ అండతో దొరికిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రోహిత్.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా చరిత్రకెక్కాడు. గతేడాది 29 వన్డేలు ఆడిన రోహిత్.. 1490 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. వన్డే ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లోనే ఐదు సెంచరీలతో 648 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అటు ఐపీఎల్‌లోను 4 టైటిళ్లు అందించి అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు.

ఆ టార్చర్ తట్టుకోలేక మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: షమీ

Story first published: Sunday, May 3, 2020, 11:34 [IST]
Other articles published on May 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+