న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs CSK తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు.. ఊరిస్తున్న రికార్డులు!

All you need to know Mumbai Indians vs Chennai Super Kings rivalry in IPL 2020

హైదరాబాద్: క్రికెట్‌ అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌లు.. స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి గిరాటేసే యార్కర్లు.. పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. ఒక్కటా..! రెండా..? ఎన్నో..! మరెన్నో..? దాదాపు రెండు నెలలపాటు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్) వచ్చేసింది.

ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా 12 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ క్యాష్ రిచ్ లీగ్.. కరోనా వైరస్ నేపథ్యంలో ఎదురైన ఆటంకాలన్నిటిని అధిగమించి 13 వ సీజన్‌కు ముస్తాబైంది. మరికొద్ది గంటల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, త్రీటైమ్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే ఆసక్తికర పోరుతో ఈ ధనాధన్ లీగ్ షురూ కానుంది.

ఇక తమ జైత్రయాత్రను తొలి మ్యాచ్ విజయంతోనే మొదలు పెట్టాలని సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ భావిస్తున్నాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ నాలుగు టైటిళ్లు గెలవగా.. ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కే మూడు సార్లు చాంపియన్‌గా నిలిచింది.

ముఖా ముఖి రికార్డు..

ముఖా ముఖి రికార్డు..

ఇరు జట్లు టైటిల్ ఫైట్‌లో నాలుగు సార్లు తలపడగా 3-1తో ముంబైనే పై చేయిసాధించింది. ఈ సీజన్‌కు ఇరు జట్లు కీలక ఆటగాళ్ల గైర్హాజరీతో బరిలోకి దిగుతున్నాయి. ముంబైకి స్టార్ పేసర్ లసిత్ మలింగా దూరం కాగా.. చెన్నై సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లేకుండా ఆడనుంది. గత 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల ముఖాముఖి పరిశీలిస్తే ముంబైదే పైచేయి. ఇప్పటి వరకు ముంబై, చెన్నై మొత్తం 30 సార్లు తలపడగా.. రోహిత్ సేన 18, ధోనీ సేన 12 సార్లు గెలిచింది. ఇక చివరి ఐదు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఐదింటికి ఐదు గెలిచి పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

బౌలింగ్, బ్యాటింగ్..

బౌలింగ్, బ్యాటింగ్..

సీఎస్‌కే‌పై రోహిత్ శర్మ 614 రన్స్ చేయగా.. సురేశ్ రైనా ముంబై ఇండియన్స్‌పై 704 రన్స్ చేశాడు. ధోనీ 570 పరుగులతో తర్వాతి స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విషయానికి వస్తే

ముంబై తరఫున చెన్నైపై 37 వికెట్లతో లసిత్ మలింగ టాప్‌లో ఉండగా.. కీరన్ పొలార్డ్ 12 వికెట్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో చెన్నై తరఫున ముంబైపై 25 వికెట్లు తీసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

బెస్ట్ బౌలింగ్, బెస్ట్ బ్యాటింగ్..

బెస్ట్ బౌలింగ్, బెస్ట్ బ్యాటింగ్..

సీఎస్‌కేపై హర్భజన్ సింగ్(5/18) బెస్ట్ బౌలింగ్ గణంకాలు నమోదు చేశాడు. గత రెండు సీజన్ల నుంచి సీఎస్‌కే‌కు ఆడుతున్న భజ్జీ అంతకు ముందు పదేళ్లపాటు ముంబైకి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు దూరమయ్యాడు. 2011 సీజన్‌లో భజ్జీ ఈ ఘనతను అందుకున్నాడు. సీఎస్‌కే తరఫున మోహిత్ శర్మ ముంబై‌పై 2014 సీజన్‌లో 4/14 అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

వ్యక్తిగత స్కోర్స్ పరిశీలిస్తే.. అరంగేట్ర సీజన్‌లో సనత్ జయసూర్య ముంబై తరఫున చెన్నైపై 114 రన్స్‌తో చెలరేగగా.. 2013లో సీఎస్‌కే తరఫున మైక్ హస్సీ 86 పరుగులు చేశాడు. ప్రస్తుత జట్లలో ముంబై తరఫున రోహిత్ 2011 సీజన్‌లో 87, గతేడాది ఫైనల్లో సీఎస్‌కే తరఫున షేన్ వాట్సన్ 80 వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్స్‌ సాధించారు.

ఊరిస్తున్న రికార్డులు..

ఊరిస్తున్న రికార్డులు..

ఈ సీజన్ ఆరంభానికి ముందే ఇరు జట్ల ఆటగాళ్లను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. మరో 73 పరుగులు చేస్తే సీఎస్‌కే ప్లేయర్ రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో 100 వికెట్లతో పాటు 2000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందుతాడు. అలాగే మరో 18 వికెట్లు పడగొడితే జస్‌ప్రీత్ బుమ్రా టీ20ల్లో 200 వికెట్ల తీసిన తొలి భారత పేసర్‌గా నిలుస్తాడు.

మరో నాలుగు మ్యాచ్‌లు ఆడితే ధోనీ అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా సురేశ్ రైనా(193) రికార్డును అధిగమిస్తాడు. మరో 102 పరగులు చేస్తే రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 5000 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాల సరసన నిలుస్తాడు.

ఐపీఎల్ 2020 సీజన్ ముందు రవీంద్ర జడేజాను ఊరిస్తున్న నెం.1 రికార్డు!

Story first published: Saturday, September 19, 2020, 10:54 [IST]
Other articles published on Sep 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X