న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ ఇద్దర్నీ రిటైన్ చేసుకోవాలి!

Aakash Chopra reveals the players Sunrisers Hyderabad should retain ahead of IPL 2021 season

న్యూఢిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల నడుమ ఐపీఎల్ 2020 సీజన్ దిగ్విజయంగా పూర్తయింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐదోసారి టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఐపీఎల్ 2021 సీజన్ కూడా వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలో భారత్‌ వేదికగా జరగనుంది. అంతేకాకుండా ఐపీఎల్ 2021లో మరో కొత్త జట్టు రానుందని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే బీసీసీఐ మెగా వేలం నిర్వహించాల్సి వస్తుంది. అప్పుడు ప్రస్తుత టీమ్స్‌లోని ఆటగాళ్లంతా వేలంలోకి వస్తారు.

జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నదం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వచ్చే సీజన్‌ వేలంలో ఆయా ఫ్రాంచైజీలు అనుసరించాల్సిన వ్యూహాలను తన యూట్యూబ్ చానెల్ వేదికగా చర్చించాడు.

భారీ మార్పులు కష్టమే..

భారీ మార్పులు కష్టమే..

ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్‌లను తప్పకుండా రిటైన్ చేసుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఇక తమ ప్రధాన పేసర్ అయిన భువనేశ్వర్‌కు బ్యాకప్ బౌలర్‌ను పొందలేరన్నాడు. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన పేసర్ అయిన భువనేశ్వర్ కుమార్‌కు బ్యాకప్‌ బౌలర్‌ను తీసుకోలేరు. ఓవర్‌సీస్ ఆటగాళ్లు రాణించినందున వీదేశీ పేసర్‌ను కొనుగోలు చేయలేరు. పైగా నలుగురికి మాత్రమే ఆడే అవకాశం ఉండటంతో ఇప్పటికే ఆ జట్టులోని ఓవర్‌సీస్ ఆటగాళ్లు అయిన బిల్లీ స్టాన్ లేక్, మహ్మద్ నబీలు ఇద్దరూ బెంచ్‌కే పరిమితమయ్యారు. కాబట్టి ఆ జట్టులో భారీ మార్పులకు పెద్దగా అవకాశం లేదు.'అని చెప్పుకొచ్చాడు.

ఆ ఇద్దరూ ఉండాల్సిందే..

ఆ ఇద్దరూ ఉండాల్సిందే..

ఇక ఆటగాళ్ల రిటైన్ అవకాశాలు గురించి మాట్లాడుతూ డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ అంటిపెట్టుకోవాల్సిందేన్నాడు. అలాగే భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌లను రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా తీసుకోవాలన్నాడు. ‘హైదరాబాద్ ఆటగాళ్లలో రిటైన్ చేసుకోవాలంటే వార్నర్, రషీద్ ఖాన్ నా ఫస్ట్ చాయిస్. ఆ తర్వాత భువీ, నటరాజన్‌లను రైట్ టూ మ్యాచ్ కార్డ్ కింద తీసుకోవాలి. అలాగే మనీష్ పాండే, కేన్ విలియమ్సన్‌లను కూడా రిటైన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే విలియమ్సన్, బెయిర్ స్టో, జాసన్ హోల్డర్‌ల మధ్య కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు. ఐపీఎల్ 2021లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వడానికి ఆ జట్టు రచించే వ్యూహాలపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుంది'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

కేన్ మామను వదులుకోం..

కేన్ మామను వదులుకోం..

మరోవైపు కేన్ విలియమ్సన్‌ను రిటైన్ చేసుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటామని డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని వదులుకోమన్నాడు. ఇటీవల ట్విటర్ వేదికగా అభిమానులకు అడిగిన ప్రశ్నకు వార్నర్ పై విధంగా సమాధానమిచ్చాడు. ‘డేవిడ్ బాయ్.. మెగా వేలం జరిగితే కేన్ మామను హైదరాబాద్ జట్టు నుంచి వెళ్లిపోతాడా?'అని ఒకరు కామెంట్ చేయగా.. దిగులుపడవద్దని బదులిచ్చిన వార్నర్.. కేన్ తమకు కావాలన్నాడు. ఇక ‘వచ్చే ఏడాది మేగా వేలం జరుగుతుందా? అదే జరిగితే కేన్‌ సేవలను కోల్పోవాల్సి ఉంటుందా?'అని మరో అభిమాని ప్రశ్నించగా.. తాము ఎట్టి పరిస్థితుల్లో కేన్ వదులు కోమని స్పష్టం చేశాడు. వేలం జరిగితే రిటైన్ చేసుకుంటామని చెప్పాడు.

రూల్స్ మార్చిన ఐసీసీ.. ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది.. భారత్‌ నెం.1 ర్యాంక్ పోయే!!

Story first published: Friday, November 20, 2020, 15:02 [IST]
Other articles published on Nov 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X