న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్ కోహ్లీ కోసమే ఆడే నలుగురు ప్లేయర్లు ఎవరంటే..!!

4 Indian cricketers who owe their careers to Virat Kohli

హైదరాబాద్: 2014నుంచి జట్టు పగ్గాలు అందుకుని కెప్టెన్‌గా బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా టీమిండియాను విజయపంథాలో నడిపిస్తున్న కోహ్లీ ప్రతి మ్యాచ్‌కు వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. ఇటీవలే పదివేల పరుగుల క్లబ్‌లో చేరిన కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్‌లలోనే చేరుకోగలిగాడు. అదీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన వాటి కంటే చాలా వేగంగా ఆ రికార్డును చేరుకున్నాడు.

అయినా ఇవేమీ నాకు పట్టవన్నట్లు రికార్డుల కోసం ఆడట్లేదని తాను జట్టును గెలిపించాలనే కష్టపడతానని తెలిపాడు. బ్యాట్స్‌మన్‌గా ఇలా ఉంటే మరి కెప్టెన్‌గానూ తనకంటూ కొందరు ఆటగాళ్లు కోహ్లీ కోసమే ఆడినట్లుగానూ కనిపిస్తుంటారు. వారిలో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, చాహల్, కుల్దీప్ యాదవ్‌లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

కేఎల్ రాహుల్:

కేఎల్ రాహుల్:

రాహుల్ ద్రవిడ్‌కు ప్రత్యేక అభిమాని అయిన కేఎల్ రాహుల్.. తరచుగా రెగ్యూలర్ క్రికెటర్‌గా కనిపించలేకపోతున్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ ఆడినప్పుడే అతని సత్తా ఏంటో తెలిసేది ఇంకా మెరుగయ్యేది కానీ, వైట్ బాల్ క్రికెట్‌కు రోహిత్.. ధావన్‌లు ఓపెనర్లుగా వ్యవహరించడంతో ఇది కాస్త కష్టంతో కూడుకున్న పనిగా మారింది. 2014 టెస్టు మ్యాచ్ ద్వారా భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న రాహుల్.. 2016లో పరిమిత ఓవర్ల కెరీర్‌ను మ్యాచ్ ఆరంభించాడు. ఒకసారి కోహ్లీ కెప్టెన్సీ తీసుకున్నప్పటి నుంచి కేఎల్ రాహుల్‌కు అవకాశాలు మెండుగా వస్తూనే ఉన్నాయి. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలోనూ వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్నా.. టెస్టు సిరీస్‌లు అన్నింటికీ అతనినే తీసుకున్నాడు. అదృష్టవశాత్తు ఐదో టెస్టులో సెంచరీ బాది పరువు నిలబెట్టుకున్నాడు.

రోహిత్ అని కాదు.. ఇండియా అని అరవండి(వీడియో)

 హార్దిక్ పాండ్యా:

హార్దిక్ పాండ్యా:

బరోడా బేస్‌డ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. దాదాపు మూడు ఫార్మాట్‌లలోనూ కోహ్లీ తుది జట్టులో ఆడుతున్నాడు. కొద్ది రోజుల ముందు ముగిసిన ఆసియా కప్ 2018లో గాయం కారణంగా స్టేడియం నుంచే వెళ్లిపోయిన పాండ్యా.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. పాండ్యా లేకపోవడంతో టీమిండియా సమతూకం తప్పిందని వివరించాడు. పాండ్యా 2016లో తన అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు. అందులో 42వన్డేలు, 11 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

యుజ్వేంద్ర చాహల్:

యుజ్వేంద్ర చాహల్:

ప్రస్తుత భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకున్న బౌలర్ యుజ్వేంద్ర చాహల్. చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకుంటోన్న చాహల్ 33మ్యాచ్‌లు ఆడి 56వికెట్లు తీశాడు. ఇంకా టీ20 ఫార్మాట్‌లో 26 మ్యాచ్‌లు ఆడి 42 వికెట్లు తీయగలిగాడు. కోహ్లీ పూర్తి నమ్మకముంచి చాహల్ చేతికి బౌలింగ్ అప్పగించడమే ఇన్ని వికెట్లు తీయడానికి గల కారణం.

కుల్దీప్ యాదవ్:

కుల్దీప్ యాదవ్:

చాహల్‌తో పాటుగా కోహ్లీసేనలో ఉన్న మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. కోహ్లీ ప్రోత్సాహంతో తానేంటో నిరూపించుకున్నాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కుల్దీప్‌పై పూర్తి నమ్మకంతో బౌలింగ్ అప్పగిస్తాడు కోహ్లీ. కాబట్టే కొన్ని మ్యాచ్‌లలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ల స్థానంలో ఆడిన కుల్దీప్‌ తగ్గ న్యాయం చేకూరుస్తాడు. టీమిండియా లీడ్ స్పిన్నర్‌గా మారిన కుల్దీప్ వన్డే క్రికెట్‌లో 50 వికెట్లు తీసిన బౌలర్‌గా మైలురాయి చేరుకున్నాడు.

Story first published: Wednesday, October 31, 2018, 13:07 [IST]
Other articles published on Oct 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X