న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ గెలుపే నా కెరీర్ మలుపు.. నా ప్రదర్శన మెచ్చిన ఓ అభిమాని తన నెల జీతాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు: సింధు

PV Sindhu Says Beating Olympic Champion Li Xuerui In 2012 Was Turning Point Of Her Career

హైదరాబాద్: లండన్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ లీ జురుయ్‌పై సాధించిన విజయం తన కెరీర్‌ను మలుపు తిప్పిందని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేర్కొంది. 2012లో చైనా ఓపెన్‌ సందర్భంగా లీ జురుయ్‌ని ఓడించడం తన ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసిందని గుర్తు చేసుకుంది. ఇక ఆ టోర్నీ క్వార్టర్స్‌లో లీ జురుయ్‌‌ను ఓడించినప్పుడు సింధు వయసు 16 ఏళ్లు. ఆ మరుసటి ఏడాదే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్‌తో సింధు తన సత్తాను ప్రపంచానికి చాటింది. ఆ తర్వాత ఈ హైదరాబాద్ స్టార్ వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం ఆమె ఖాతాలో 5 ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలతో పాటు, ఒలింపిక్స్‌ రజతం ఉంది. 'ఇన్‌ ద స్పోర్ట్‌లైట్‌' షో సందర్భంగా టీటీ ప్లేయర్‌ ముదిత్‌ డానీతో సింధు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

 నా తప్పు ఏంటో తెలిసేది కాదు...

నా తప్పు ఏంటో తెలిసేది కాదు...

‘కెరీర్ ప్రారంభంలో నేను బాగానే ఆడుతున్నా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటలేకపోయా. తరచుగా క్వాలిఫయింగ్‌ , తొలి రౌండ్లలోనే ఓడిపోయేదాన్ని. ఇంకా కష్టపడాలేమో అనుకొని తీవ్రంగా ప్రాక్టీస్‌ చేసేదాన్ని. అయినా ఓటములు ఎదురయ్యేవి. చాలా నిరాశగా ఉండేది. నా పొరపాటేంటో అర్థమయ్యేది కాదు. మిగతా వారిలాగే కష్టపడ్డా గెలుపు మాత్రం అందకపోయేది.

టర్నింగ్ పాయింట్...

టర్నింగ్ పాయింట్...

ఈ క్రమంలో 2012లో లండన్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ లీ జురుయ్‌పై గెలవడంతో నా కెరీర్ మలుపు తిప్పింది. నా కెరీర్‌లో అదే టర్నింగ్‌ పాయింట్‌. ఆ గెలుపు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అంతేకాక నేను మరింత కష్టపడేలా చేసింది. నాటి నుంచి ప్రతీరోజు, ప్రతీ ఏడాదీ నా ఆటను మెరుగు పరుచుకుంటూనే ఉన్నా.

బహుమతిగా అభిమాని నెలజీతం...

బహుమతిగా అభిమాని నెలజీతం...

రియోలో సిల్వర్ మెడల్ గెలిచిన తర్వాత ఓ ఫ్యాన్ తన ఒక నెల జీతాన్ని బహమతిగా పంపాడు. అది ఎప్పటికీ మరచిపోలేను. ఆ తర్వాత అతనికి ఓ లెటర్ రాశా.. కొంత డబ్బు కూడా పంపా. కరోనా వల్ల అనుకోకుండా దొరికిన ఈ బ్రేక్‌లోని కొన్ని కొత్త పనులు నేర్చుకున్నా. పెయింట్ చేస్తున్నా. వంట కూడా చేస్తున్నా'అని సింధు చెప్పుకొచ్చింది.

భర్తకు బ్రేకప్ చెప్పిన క్రికెట్ బ్యూటీ

Story first published: Monday, July 27, 2020, 10:07 [IST]
Other articles published on Jul 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X