Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భర్తకు బ్రేకప్ చెప్పిన క్రికెట్ బ్యూటీ ఎలిస్ పెర్రీ

Australian Women’s Cricket Team all-rounder Ellyse Perry And Matt Toomua End Their Marriage After 5 Years

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలిస్ పెర్రీ గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం మహిళల క్రికెట్‌లో అత్యంత అందమైన మహిళా క్రికెటర్ ఎలిస్ పెర్రీ‌ మాత్రమే. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టులోనే కాదు ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఎలిస్ పెర్రీ గుర్తింపు పొందింది.

ఆస్ట్రేలియా తరఫున క్రికెట్, ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ టోర్నీల్లో బరిలోకి దిగిన మహిళగా అరుదైన రికార్డ్ ఈ బ్యూటీ క్రికెటర్ సొంతం. ఫుట్‌బాల్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి క్రికెటర్‌గా కొనసాగుతున్న ఎలిస్ పెర్రీ‌ ఆల్‌రౌండర్‌గా మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియా‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె తన భర్తతో విడిపోయింది. రగ్బీ ఆటగాడైన మౌట్ టమౌను పెర్నీ 2015 డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంది.

అయితే ఐదేళ్ల తమ వివాహ బంధాన్ని ముగిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. గతేడాది కాలంగా వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ జంట ఆదివారం ఓ ఉమ్మడి ప్రకటన చేసింది. 'పరస్పర గౌరవంతోనే మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం.

ఇందులో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు' అని పేర్కొంది. రెండుసార్లు ఐసీసీ మహిళల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న పెర్రీ.. మార్చిలో టీ20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లో గాయపడి ఆటకు దూరమైంది. ఇటీవలే గాయానికి సర్జరీ చేయించుకుంది.

Story first published: Monday, July 27, 2020, 9:37 [IST]
Other articles published on Jul 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+