న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పారా వరల్డ్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం: ఎవరీ మానసి జోషి

India’s Manasi Joshi bags her maiden gold at Para-Badminton World Championships

హైదరాబాద్: స్విట్లర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి భారత బ్యాడ్మింటన్‌ కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసిన పీవీ సింధుకు భారతావని మొత్తం నీరాజనాలు పలుకుతోంది. ఈ క్రమంలో 36 ఏళ్ల నిరీక్షణకు పీవీ సింధు తెరదించడంతో పాటు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి మహిళ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.

ఇలా యావత్ భారతావని సింధు విజయాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంతో మునిగిపోయిన అదే ఆదివారం... అదే వేదికగా జరిగిన పారా బ్యాడ్మింటన్ టోర్నీలో మరో భారత అథ్లెట్ స్వర్ణం సాధించింది. తన పేరు మానసి జోషి. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ పారుల్‌ పామర్‌ను మట్టికరిపించి తొలిసారి పారా వరల్డ్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్‌: మొన్న ఐపీఎల్... నిన్న ప్రో కబడ్డీ... నేడు పుట్‌బాల్ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్‌: మొన్న ఐపీఎల్... నిన్న ప్రో కబడ్డీ... నేడు పుట్‌బాల్

కాగా, పారా బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొన్న భారత అథ్లెట్లు మొత్తం 12 పతకాలను సాధించారు. ఇక్కడ విశేషం ఏంటంటే మానసి జోషి సైతం గోపీచంద్‌ అకాడమీలోనే శిక్షణ తీసుకుంది. పీవీ సింధు మాదిరే పారా బ్యాడ్మింటన్ అథ్లెట్లకు కూడా ఘన స్వాగతం లభించింది. అనంతరం పతకాలు నెగ్గిన షట్లర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజుని కలిశారు.

ఈ క్రమంలో పురుషుల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించి ప్రమోద్ భగత్‌కు, మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించి మానసి జోషిలకు రిజుజు రూ.20 లక్షల నగదు బహుమానం అందించారు.

ముంబైలో 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో

ముంబైలో 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో

మానసి జోషి స్వర్ణం సాధించడం వెనుక పెద్ద కష్టమే ఉంది. ముంబైలో 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మానసి జోషి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఎముకలు విరిగిపోవడంతో పాటు ఆమె ఎడమ కాలు తెగిపడింది. ప్రమాదం జరిగిన మూడు గంటల అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. పది గంటల పాటు ఆమెకు ఆపరేషన్ నిర్వహించిన చివరకు ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే ఆమె కాలు మాత్రం తిరిగి అతికించే అవకాశం లేదని చెప్పారు. గ్యాంగ్రీన్‌ సోకిన కారణంగా దానిని తొలగించామని చెప్పారు. అయితే ఆ విషాదం నుంచి తేరుకున్న మానసి నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు.

ఛాంపియన్‌షిప్‌ కోసం సింధు జిమ్‌లో ఎలాంటి వర్కౌట్లు చేసిందంటే!! (వీడియో)

కృత్రిమ కాలుతో నడవడం

కృత్రిమ కాలుతో నడవడం

ఈ క్రమంలో దాదాపు ఏడాది తర్వాత కృత్రిమ కాలుతో నడవడం ప్రారంభించిన మానసి బ్యాడ్మింటన్‌పై ఆసక్తితో ఆట సాధన చేశారు. అదేవిధంగా స్కూబా డైవింగ్‌లో కూడా మెళకువలు నేర్చుకున్నారు. పారా ఆసియా గేమ్స్‌లో ఎంపిక కాలేదు. ఆ తర్వాత మరింత పట్టుదలతో బ్యాడ్మింటన్‌లో రాణించారు. 2014లో పారా ఆసియా గేమ్స్‌తో అంతర్జాతీయ క్రీడల్లో ప్రవేశించిన మానసి శరీరంలో ఒక భాగం కోల్పోయినంత మాత్రాన జీవితంలో ఇక ఏమీ సాధించలేమనే భావనను దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చాంపియన్‌గా నిలిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

ఎంతో గర్వంగా ఉంటుంది

ఎంతో గర్వంగా ఉంటుంది

టోర్నీలో స్వర్ణం నెగ్గడంపై మానసి మాట్లాడుతూ "ప్రపంచ చాంపియన్‌ అనిపించుకోవడం ఎంతో గర్వంగా ఉంటుంది. అయితే ఈ విజయం నాకు అలవోకగా దక్కలేదు. ఎన్నో సవాళ్లను అధిగమించి స్వర్ణం దక్కించుకున్నా. ఎంతో మంది క్రీడాకారులు ఇలాంటి క్షణం కోసం నాలాగే ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. కెనడియన్‌ ఓపెన్‌లో నేను పారుల్‌(ఇండియా) చేతిలో ఓటమి చవిచూశా. అందుకే ఈ పోటీలకు మానసికంగా సన్నద్ధమయ్యా. ఫిట్‌నెస్‌తో పాటు ఆట తీరుపై మరింత దృష్టి పెట్టాను. ఎంతో మంది గొప్ప క్రీడాకారులు అసాధారణ విజయాలు సాధించిన ఇదే వేదికపై నేను కూడా నా కలను సాకారం చేసుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది" అని చెప్పారు.

85 ఏళ్ల వయసులో రిటైర్మెంట్‌ ప్రకటించిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్!!

నా జీవితం మారుతుందనుకుంటున్నా

నా జీవితం మారుతుందనుకుంటున్నా

వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు రెండు నెలల ముందు హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో చేరారు. "ఇప్పటికైనా ఓ క్రీడాకారిణిగా నా జీవితం మారుతుందనుకుంటున్నా. ఈ పతకం సాధించడం కోసం నేను పడిన కఠోర శ్రమకు తగిన గుర్తింపు, సహాయం లభిస్తుందని ఆశిస్తున్నా. వచ్చే ఏడాది జరుగనున్న పారా ఒలంపిక్స్‌పైనే ప్రస్తుతం దృష్టి సారించాను" అని ఆమె తెలిపారు.

Story first published: Wednesday, August 28, 2019, 13:24 [IST]
Other articles published on Aug 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X