న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుశాంత్‌ ఇంత బాధపెడతావ్‌ అనుకోలేదు.. హృదయం బద్ధలవుతోంది: సానియా

You said we would play tennis together: Sania Mirza mourns the loss of actor Sushant Singh Rajput


హైదరాబాద్:
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవితాన్ని క్రీడాభిమానుల కళ్ల ముందు సాక్షాత్కరింపజేసిన బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్.‌ 'ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమాలో ధోనీ పాత్రలో అతడు అద్భుతంగా జీవించారు. మహీ పాత్రను అద్భుతంగా పోషించిన అతను క్రికెట్‌ అభిమానుల్ని కూడా విశేషంగా ఆకట్టుకున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ జీవిత కథలో సుశాంత్‌ ఒదిగిపోయిన తీరుకు ముగ్ధులైపోయారు. ఈ సినిమా చూశాక ధోనీ అభిమానులందరూ అతడికీ అభిమానులుగా మారిపోయారు. అయితే సుశాంత్‌ ఆత్మహత్య సినీ ప్రియుల్నే కాదు.. క్రీడా ప్రేమికుల్ని కూడా తీవ్రంగా కలచివేసింది. పలువురు క్రికెటర్లు సుశాంత్‌ విషాదాంతంపై విస్మయానికి లోనయ్యారు.
క్రీడాకారుల దిగ్భ్రాంతి:

క్రీడాకారుల దిగ్భ్రాంతి:

చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయావు మిత్రమా అంటూనే.. ఈ వార్త అబద్ధమైతే బావుండంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భారత పరిమిత ఓవర్ల మహిళా సారథి మిథాలీ రాజ్, స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్‌ శర్మ, మాజీ ఓపెనర్ వీరేందర్ వీరేంద్ర సెహ్వాగ్‌, సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ సహా అనేక మంది క్రీడాకారులు సోషల్‌ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇద్దరం కలిసి టెన్నిస్‌ ఆడదామని చెప్పావ్‌:

సుశాంత్‌ మృతిపై సానియా మీర్జా ఆవేదన వ్యక్తం చేసారు. 'ఏదో ఒక రోజు ఇద్దరం కలిసి టెన్నిస్‌ ఆడదామన్నావు. నీ జీవితంలో ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నావు. ఎక్కడ ఉన్నా సంతోషాన్ని పంచావు. నిన్ను ఇంతలా ఏం బాధించిందో కూడా మాకు తెలియదు. ప్రపంచం నిన్ను మిస్‌ అవుతుంది. చివరకు ఇంత బాధపెడతావ్‌ అనుకోలేదు. హృదయం బద్ధలవుతోంది. వణుకుతూనే ఇది రాశా. నీ ఆత్మకు శాంతి చేకూరాలి స్నేహితుడా' అని ట్వీట్ చేసారు.

 చాలా తొందరగా వెళ్లిపోయావు:

చాలా తొందరగా వెళ్లిపోయావు:

'ఆ అందమైన నవ్వు వెనక ఎంత సంఘర్షణ దాగుందో తెలుసుకోలేకపోయాం. చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నావు. మేం నిన్ను కోల్పోయాం' అని మిథాలీ రాజ్ ట్విట్టర్ వేదికగా తమ సంతాపం తెలిపారు. 'నిజంగా షాకింగ్‌లా ఉంది‌. చాలా తొందరగా వెళ్లిపోయావు. ఆన్‌స్క్రీన్‌ ధోనీని కోల్పోయాం. నీ ఆత్మకు శాంతి కలగాలి' అని సైనా నెహ్వాల్‌ ట్వీట్ చేసారు.

ఎవరైనా ఇది అబద్ధమని చెప్పండి:

ఎవరైనా ఇది అబద్ధమని చెప్పండి:

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గురించి విని దిగ్భ్రాంతికి గురయ్యా. ఈ విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. అతడి కుటుంబం, సన్నిహితులకు దేవుడు పూర్తి మనోధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలి-విరాట్ కోహ్లీ

నమ్మాలనిపించడం లేదు -రోహిత్‌ శర్మ

నమ్మాలనిపించడం లేదు -రోహిత్‌ శర్మ

సుశాంత్‌ మరణం కలిచి వేస్తోంది. అతనో ప్రతిభావంతుడైన యువ నటుడు. వారి కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి-సచిన్‌ టెండూల్కర్‌

దీన్ని నమ్మాలనిపించడం లేదు. చాలా బాధగా ఉంది. నీ ఆత్మకు శాంతి కలగాలి బ్రదర్‌-రోహిత్‌ శర్మ

ఈ విషాదాంతం షాకింగ్‌గా ఉంది. కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం-రవిశాస్త్రి

షాకింగ్, నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. సుశాంత్‌ కుటుంబం కోసం ప్రార్థిస్తా-శిఖర్‌ ధావన్‌

జీవితం సున్నితమైనది. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందరితో దయతో మెలగండి. ఓం శాంతి-వీరేంద్ర సెహ్వాగ్‌

మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన సందర్భమిది. సుశాంత్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి-వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఎవరైనా ఇది అబద్ధమని చెప్పండి. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌‌ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా-హర్భజన్‌ సింగ్

Story first published: Monday, June 15, 2020, 7:11 [IST]
Other articles published on Jun 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X