న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2022: సెమీస్‌లో ఓడిన సానియా జోడీ.. మ్యాచ్‌కు హాజరైన ధోనీ!

Wimbledon 2022: Sania Mirza and Mate Pavic lose mixed doubles clash; Dhoni, Sunil Gavaskar spotted

లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ సెమీఫైనల్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశే ఎదురైంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియా భాగస్వామి పావిచ్‌తో కలిసి సెమీఫైనల్లో అడుగుపెట్టిన సానియాకు నీల్(బ్రిటన్), క్రాయెసిక్(అమెరికా) జోడీ చేతిలో ఓటమి ఎదురైంది. బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ కీలక పోరులో సానియా జంట 6-4, 5-7, 4-6తో నీల్‌ (బ్రిటన్‌), క్రాయెసిక్‌ (అమెరికా) చేతిలో పరాజయంపాలైంది. దాంతో సానియా కెరీర్ వింబుల్డన్ టైటిల్ లేకుండానే ముగిసింది.

సానియా ఖాతాలో లేని మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ వింబుల్డన్‌ ఒక్కటే. ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ అయిన సానియా.. వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు 2011, 2013. 2015లో ఆమె ఇక్కడ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. వింబుల్డన్ తర్వాత టెన్నిస్ నుంచి తప్పుకుంటానని సానియా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ఓటమితో ఆమె 21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఎండ్‌కార్డ్ పడింది. 2001లో కెరీర్ ప్రారంభించిన సానియా.. మిక్స్‌డ్‌ డబుల్స్ విభాగంలో 2009 ఆస్ట్రేలియా ఓపెన్, 2012 ఫ్రెంచ్ ఓపెన్, 2014 యూఎస్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకుంది. 2008, 2014, 2017 ఆస్ట్రేలియా ఓపెన్‌తో పాటు 2016 ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. మహిళల డబుల్స్ విభాగంలె మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకుంది. 2011 ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సానియా.. 2015 వింబుల్డన్, యూఎస్‌ఓపెన్, 2016 ఆస్ట్రేలియ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్స్‌ను గెలిచింది.

ఈ మ్యాచ్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హాజరయ్యారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని సానియాను ఎంకరేజ్ చేశారు. ఇక సానియాతో మహేంద్ర సింగ్ ధోనీ మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. గతంతో ఇరు కుటుంబాలు కలిసి దుబాయ్‌కి వెకేషన్‌కు కూడా వెళ్లాయి. ఈ క్రమంలోనే కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న సానియాను ఎంకరేజ్ చేయడానికి ధోనీ వచ్చినట్లు టెన్నిస్ వర్గాలు పేర్కొన్నాయి.

Story first published: Thursday, July 7, 2022, 8:26 [IST]
Other articles published on Jul 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X