న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2021 Day 1: సిట్సిపాస్, క్విటోవాకు షాక్.. జొకోవిచ్, సబలెంకా బోణీ!

Wimbledon 2021 Day 1: Novak Djokovic, Aryna Sabalenka wins, Tsitsipas, Kvitova crashes out on opening day

లండన్‌: రెండేళ్ల తర్వాత తిరిగి మొదలైన ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో తొలి రోజే సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌, మూడో సీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టాడు. ఇక డిఫెండింగ్‌ చాంపియన్ నొవాక్‌ జొకోవిచ్‌, రెండో సీడ్‌ అరియానా సబలెంకా, సోఫియా కెనిన్‌, 7వ సీడ్‌ స్వియటెక్‌ రెండో రౌండ్‌కు చేరుకొన్నారు. మాజీ చాంపియన్‌ పెట్రా క్విటోవాకు షాక్‌ తగిలింది. వర్షం కారణంగా తొలి రోజు జరగాల్సిన 64 మ్యాచ్‌ల్లో 16 రద్దయ్యాయి. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూనే పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించడంతో కొంత సందడి కనిపించింది.

 సిట్సి‘పాస్‌' కాలేదు

సిట్సి‘పాస్‌' కాలేదు

మట్టి కోర్టులపై అదరగొట్టే గ్రీస్‌ యువ టెన్నిస్‌ స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ పచ్చిక కోర్టులపై మాత్రం తడబడ్డాడు. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సిట్సిపాస్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 57వ ర్యాంకర్‌ ఫ్రాన్సెస్‌ టియాఫో (అమెరికా) వరుస సెట్‌లలో 6-4, 6-4, 6-3తో ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ సిట్సిపాస్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. తన కెరీర్‌లో టాప్‌-5లోని ఆటగాడిపై నెగ్గడం టియాఫోకిదే తొలిసారి. రెండు గంటల రెండు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టియాఫో తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. 15 ఏస్‌లు సంధించిన సిట్సిపాస్‌ 22 అనవసర తప్పిదాలు చేశాడు.

జొకోవిచ్ శుభారంభం..

జొకోవిచ్ శుభారంభం..

మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్, టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) శుభారంభం చేశాడు. జేక్‌ డ్రేపర్‌ (బ్రిటన్‌)తో జరిగిన తొలి రౌండ్‌లో జొకోవిచ్‌ 4-6, 6-1, 6-2, 6-2తో గెలుపొందాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఏకంగా 25 ఏస్‌లు సంధించాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 4-6, 6-4, 6-1, 6-2తో డెల్‌బోనిస్‌ (అర్జెంటీనా)పై విజయం సాధించాడు.

స్లోన్‌ స్టీఫెన్స్‌ సంచలనం

స్లోన్‌ స్టీఫెన్స్‌ సంచలనం

మహిళల సింగిల్స్‌ విభాగంలో 2011, 2014 చాంపియన్, పదో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) తొలి రౌండ్‌లోనే షాక్ తగిలింది. 2017 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్, ప్రపంచ 73వ ర్యాంకర్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) 6-3, 6-4తో క్విటోవాను ఓడించింది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 6-1, 6-4తో నికెలెస్కూ (రొమేనియా)పై, 11వ సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌) 6-0, 6-1తో ఫియోనా (ఫ్రాన్స్‌) పై, నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) 6-4, 6-2తో జిన్‌యు వాంగ్‌ (చైనా)పై, ఏడో సీడ్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌) 6-4, 6-4తో సు వె సెయి (చైనీస్‌ తైపీ)పై, 23వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6-3, 6-4తో స్వాన్‌ (బ్రిటన్‌)పై గెలిచారు. బ్రిటన్‌ ప్లేయర్‌ జొహన్నా కొంటా వింబుల్డన్‌ నుంచి తప్పుకొంది. ఆమె సహాయక సిబ్బందిలో ఒకరికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో కొంటా టోర్నీనుంచి వైదొలిగింది.

Story first published: Tuesday, June 29, 2021, 8:31 [IST]
Other articles published on Jun 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X