న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Naomi Osaka నీ ధైర్యానికి సెల్యూట్‌.. అండగా నిలుస్తున్న క్రీడాలోకం!

Novak Djokovic says Naomi Osaka Brave And Bold Over French Open Withdrawal
French Open 2021: Naomi Osaka Withdrawal | Stars Support | Novak Djokovic || Oneindia Telugu

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నవోమి ఒసాకాకు వరల్డ్‌ నంబర్‌ వన్‌, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌ సెల్యూట్‌ చేశాడు. ఆమె నిర్ణయం ఎంతో సాహసోపేతమైందని కొనియాడాడు. 'నవోమికి నా మద్దతు ఉంటుంది. ఆమె సాహసోపేత నిర్ణయం తీసుకొంది.'అని జొకోవిచ్ తెలిపాడు. ఎఫ్‌-1 వరల్డ్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ కూడా ఒసాకకు అండగా నిలిచాడు. ఒసాకా వేగంగా కోలుకొని మరింత బలంగా తిరిగొస్తుందని ఆశిస్తున్నానన్నాడు.

ఒసాకా ఒంటరి కాదని.. ఎంతో మంది తన వెంట ఉన్నారన్న విశ్వాసం ఆమెలో కలిగించాలని తన ఫాలోవర్లను కోరుతూ హామిల్టన్‌ ట్వీట్‌ చేశాడు. మానసిక అనారోగ్యమనే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్నాడు. నవోమి నిర్ణయాన్ని అమెరికా మహిళా గోల్ఫర్‌ మిచెల్‌ వి కూడా సమర్థించింది. 'తమ ప్రదర్శన సరిగ్గా లేని రోజు మీడియాను ఎదుర్కోవడం ఎంత కష్టమో ఆటగాళ్లందరికీ అనుభవమే. ఆటకంటే మించిన జీవితం ఎంతో ఉంది'అని మిచెల్‌ చెప్పింది.

భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం ఒసాకాకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. క్రీడాకారులకు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని తెలిపాడు. టెన్నిస్, బ్యాడ్మింటన్​ వంటి వ్యక్తిగత ఆటలలో ఇది కాస్త ఎక్కువేనని పేర్కొన్నాడు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఆటగాళ్లకు మీడియా సమావేశాల నుంచి సడలింపులు ఇవ్వాలని సూచించాడు. ఇక అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ కూడా ఒసాకాను మెచ్చుకుంది. ఆమెకు ఓ హగ్ ఇవ్వాలనుకుంటానని తెలిపింది. గతంతో తాను కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నానని తెలిపింది.

అయితే భారత టెన్నిస్‌ మాజీ స్టార్‌ మహేశ్‌ భూపతి మాత్రం ఒసాకా నిర్ణయంతో విభేదించాడు. ఆ నిర్ణయం సరికాదంటూ.. సమస్యను ఆమె ఇంకా సమర్థంగా ఎదుర్కోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'నేనూ గతంలో ఎన్నో విలేకరుల సమావేశాల్లో పాల్గొన్నా. కానీ నవోమి చెబుతున్న విషయాలతో నేను ఏకీభవించను. టెన్నిస్‌ ప్లేయర్లలో ముఖ్యంగా మేటి ఆటగాళ్ల జీవితంలో మీడియా అనేది ఓ భాగం. విలేకరులు వివిధ రకాల ప్రశ్నలు సంధిస్తారు. వాటిలో మనకు నచ్చని వాటిని దాటవేసే హక్కు ఉంటుంది. అందువల్ల ఒసాకా ఈ సమస్యను ఇంకా మెరుగైన రీతిలో పరిష్కరించుకొని ఉండాల్సింది' అని భూపతి అన్నాడు.

ఫ్రెంచ్​ ఓపెన్ తొలిరౌండ్‌ విజయానంతరం మీడియా సమావేశానికి హాజరుకాకుండా వెళ్లిన ఒసాకాకు రిఫరీ 15,000 డాలర్ల జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి చెందిన ఒసాకా టోర్నీ నుంచి వైదొలిగింది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా ఉండేందుకు తాను ఫ్రెంచ్‌ ఓపెన్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. 2018 యూఎస్‌ ఓపెన్‌ నుంచి తాను మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నట్లు, అందుకే తప్పుకొంటున్నట్లు ట్వీట్‌ చేసింది.

Story first published: Thursday, June 3, 2021, 12:47 [IST]
Other articles published on Jun 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X