నా భర్తకూ చెప్పేశా, ఇదే మా కుటుంబ రహస్యం: సానియా మీర్జా

Posted By:
My child will have surname Mirza Malik: Sania Mirza

హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే సంతానం విషయంలో మాత్రం వీరిద్దరూ ఓ ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారట. అదేమంటే ఇంటిపేరు ఎలా ఉండనున్నదనే విషయం. షోయబ్, సానియా ఇంటిపేర్లు రెండు కలిపి పెడదామని నిశ్చయించుకున్నారట.

సానియా మీర్జా తనకు అమ్మాయిలంటేనే:

సానియా మీర్జా తనకు అమ్మాయిలంటేనే:

ఈ సందర్భంగా హైదరాబాదీ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా తనకు అమ్మాయిలంటేనే ఇష్టమని చెప్పింది. కుమారుడికన్నా కుమార్తెలంటేనే ఇష్టమని వారి పేర్లలో మా ఇద్దరి ఇంటి పేర్లు కలిసే ఉంటాయని సానియా చెప్పుకొచ్చింది. దీనిపై తన భర్త పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో ఇది వరకే తాను మాట్లాడనని ఆమె తెలిపింది.

కుటుంబం రహస్యం చెప్పాలనుకుంటున్నా:

కుటుంబం రహస్యం చెప్పాలనుకుంటున్నా:

‘గోవా ఫెస్ట్‌'కు విచ్చేసిన సానియా మాట్లాడుతూ.. ‘నేనీ రోజు మా కుటుంబం రహస్యం చెప్పాలనుకుంటున్నా. మాకు సంతానం ఎప్పుడు కలిగినా వారి పేర్లలో ‘మీరా మాలిక్‌'ను జోడించాలని నేను, మా ఆయన నిర్ణయించుకున్నాం. నిజానికి షోయబ్ కూడా అమ్మాయే కావాలిన ఆశిస్తున్నాడు' అని తెలిపింది. లింగవివక్షకు సంబంధించిన చర్చ తమ బంధువులు, సన్నిహితులతో తరచూ జరిగాయని చెప్పింది.

మేమిద్దరం అమ్మాయిలమే:

మేమిద్దరం అమ్మాయిలమే:

‘మా తల్లిదండ్రులకు మేమిద్దరం అమ్మాయిలమే. మాకు మాత్రం సోదరుడు లేడన్న బెంగ ఎప్పుడూ లేదు. కానీ మా బంధువులంతా మా వాళ్లతో ఓ అబ్బాయి వుంటే బాగుండేదని, మీ ఇంటి పేరు నిలబడేదని ఎప్పుడు చెబుతుండేవారు. దీంతో నేను మా బంధువులతో తగవుకు దిగేదాన్ని. అమ్మాయిలేం తక్కువని గట్టిగా వాదించేదాన్ని. ‘మీర్జా'ను ఇకముందూ కొనసాగిస్తాను. ఈ కాలంలోనూ ఇంకా అమ్మాయిలు, అబ్బాయిలనే తారతమ్యాలేంటి' అని సానియా వివరించింది.

ఇంటిపేరు మార్చుకోలేదు:

ఇంటిపేరు మార్చుకోలేదు:

‘అమ్మాయయైనా.. అబ్బాయయైనా ఎవరైనా నాకు ఒకటే. పెళ్లైన తర్వాత నా ఇంటిపేరు మార్చుకోలేదు. ఇప్పటికీ నా పేరు సానియామీర్జా. అందుకే మాకు పుట్టబోయే బిడ్డకు నా భర్త, నా పేరు కలిసొచ్చేటట్లు మీర్జా మాలిక్‌ అనే ఇంటిపేరు పెట్టాలనుకుంటున్నాం'' అని సానియా చెప్పింది.

Story first published: Sunday, April 8, 2018, 14:35 [IST]
Other articles published on Apr 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి