న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Naomi Osakaకు భారీ జరిమానా.. రిపీట్ చేస్తే డిస్ క్వాలిఫై చేస్తామని వార్నింగ్!

Japanese Naomi Osaka Fined And Threatened With French Open Default Over Media Boycott

పారిస్​: ముందుగా చెప్పినట్లే మీడియా సమావేశాన్ని బహిష్కరించిన జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకాకు మ్యాచ్ రిఫరీ భారీ జరిమానా విధించారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఒసాకా 6-4, 7-6 (7/4)తో పాట్రికా మారియాటిగ్‌(రొమేనియా)పై సునాయస విజయాన్నందుకుంది.

అయితే ఈ విజయానంతరం ఆమె మీడియా సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయింది. దాంతో టోర్నీ నిబంధనల మేరకు మ్యాచ్ రిపరీ రొనాల్డ్ గారోస్.. ఒసాకాకు 15 వేల డాలర్లు(రూ.11 లక్షల) జరిమానా విధించారు. అంతేకాకుండా మళ్లీ ఇలానే చేస్తే టోర్నీ నుంచి డిస్‌క్వాలిఫై చేస్తామని కూడా హెచ్చరించారు.

అందరూ రూల్స్ పాటించాల్సిందే..

అందరూ రూల్స్ పాటించాల్సిందే..

గ్రాండ్‌స్లామ్‌ రూల్స్​ ప్రకారం.. మీడియా సమావేశాన్ని బహిష్కరిస్తే గరిష్టంగా 20 వేల డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) దాకా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా ఒసాక మొండిగా ప్రవర్తించడం నిర్వాహకులకు మరింత ఆగ్రహానికి గురి చేసింది. నిబంధనల ముందు అందరూ సమానమేనని, ఒసాక ఏం ప్రత్యేకం కాదని, రూల్స్ అందరూ పాటించాల్సిందేనని వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియాన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ నిర్వాహక కమిటీలు సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి.

మానసిక ఆరోగ్యం కోసం..

మానసిక ఆరోగ్యం కోసం..

ఇక ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రారంభానికి ముందే ఒసాకా మీడియా సమావేశాలకు హాజరుకానని ప్రకటించింది. ఆటగాళ్లను బాధపెట్టే విధంగా మీడియా అడిగే ప్రశ్నలు తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పింది. గ్రాండ్‌స్లామ్‌ నిబంధనల ప్రకారం మీడియా సమావేశానికి హాజరు కాకపోతే భారీ జరిమానా విధించే అవకాశం ఉందన్నా పట్టించుకోలేదు. అందుకు తాను సిద్ధమని ప్రకటించింది. అన్నట్లుగా ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌‌కు హాజరు కాకుండా వెళ్లిపోయింది.

అలవోకగా..

అలవోకగా..

తొలి రౌండ్లో ఒసాకా 6-4, 7-6 (7-4) తేడాతో మారియా (రొమేనియా)పై విజయం సాధించింది. బలమైన సర్వీసులు, శక్తిమంతమైన షాట్లతో వరుసగా మూడు గేమ్‌లు గెలిచిన ఒసాకా తొలి సెట్‌లో 3-0తో దూసుకెళ్లింది. అదే జోరులో 5-2తో సులభంగా గెలిచేలా కనిపించింది. కానీ ఆ దశలో పుంజుకున్న ప్రత్యర్థి ప్రతిఘటించింది. వరుసగా రెండు గేమ్‌లు గెలిచింది. కానీ ఆ వెంటనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఒసాకా తొలి సెట్‌ సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్లో పోరు హోరాహోరీగా సాగింది. ఇద్దరు ప్లేయర్లు పాయింట్ల కోసం తీవ్రంగా పోటీపడ్డారు. చివరకు టై బ్రేకర్‌లో ఒసాకా గెలిచింది.ఈ పోరులో 39 విన్నర్లు కొట్టిన ఆమె.. ఓ ఎస్‌ సంధించింది.

సబలెంక ముందంజ..

సబలెంక ముందంజ..

ఇతర మ్యాచ్‌ల్లో సబాలెంక 6-4, 6-3 తేడాతో కొంజూ (క్రొయేషియా)పై నెగ్గింది. మ్యాచ్‌లో ఏడు ఏస్‌లు సంధించిన ఆమె.. 24 విన్నర్లు కొట్టింది. 11వ సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-7 (3-7), 7-6 (7-5), 6-1తో మినెన్‌ (బెల్జియం)పై గెలిచి రెండో రౌండ్‌ చేరింది. మూడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ)కు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మరోసారి నిరాశే ఎదురైంది.

ఈ 26వ సీడ్‌ 2-6, 4-6తో ఉక్రెయిన్‌ క్వాలిఫయర్‌ కలినీనా చేతిలో పరాజయం చవిచూసింది. ప్రస్తుతం 139వ ర్యాంకులో ఉన్న 24 ఏళ్ల కలినీనా ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో బరిలో దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం. రొలాండ్‌ గారోస్‌లో గత 14 పర్యాయాల్లో కెర్బర్‌ ఎనిమిది సార్లు తొలి రౌండ్లోనే ఓడిపోవడం గమనార్హం.

Story first published: Monday, May 31, 2021, 13:31 [IST]
Other articles published on May 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X