For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆశల్లేనట్టే: డబుల్స్‌లో సానియా మీర్జా-అంకితా రైనా జోడీ పరాజయం: కవలల చేతిలో చిత్తు

Indian womens pair of Sania Mirza and Ankita Raina lose first round match against Ukraine

టోక్యో: ఎన్నో ఆశలు పెట్టుకున్న టెన్నిస్‌లో భారత్‌ను పరాజయం పలకరించింది. మహిళల టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా-అంకితా రైనా జంట ఓటమి పాలైంది. కనీసం ప్రతిఘటించకుండా ఓటమిపాలు కావడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఒకప్పుడు మెరుపులు మెరిపించిన సానియా మీర్జా.. ఇప్పుడు తన స్థాయికి తగ్గట్టుగా ఆడట్లేదనేది ఈ మ్యాచ్‌తో తేలిపోయింది. గుజరాత్‌కు చెందిన అంకితా రైనాతో జతకట్టి డబుల్స్ ఆడిన సానియా మీర్జా ఆమెను సమన్వయపర్చుకోవడంలో విఫలమైంది. అంకితా రైనాకు ఇదే తొలి ఒలింపిక్స్.

విమెన్స్ టెన్నిస్ డబుల్స్ కేటగిరీ తొలి రౌండ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన కవల పిల్లలు లిడ్మిలా విక్టోర్వినా కిచెనొక్, నాదియా విక్టోర్వినా కిచెనొక్ జంట 6-0, 6-7 (8-10) తేడాతో సానియా మీర్జా-అంకితా రైనాలపై ఘన విజయాన్ని అందుకుంది. తొలి సెట్‌లో కిచెనొక్‌‌లపై అద్భుతంగా ఆధిపత్యాన్ని సాధించింది సానియా మీర్జా-అంకిత రైనా జోడీ. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆ సెట్‌ను 6-0 తేడాతో గెలుచుకుందంటే భారత జంట దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే వేగాన్ని రెండో సెట్‌లో కొనసాగించలేకపోయింది. రెండో సెట్‌లో ఎల్ కిచెనొక్, ఎన్ కిచెనొక్ ఆట గాడిలో పడింది. సానియా-అంకితాలపై ఆధిపత్యాన్ని కనపరిచారు.

టైబ్రేక్ వరకు వెళ్లిన ఈ సెట్‌లో సానియా-అంకితా రైనా జోడీ శక్తిసామర్థ్యాలన్నీ హరించిపోయినట్టు కనిపించింది. కిచెనొక్ సిస్టర్స్ ఈ సెట్‌లో బౌన్స్ బ్యాక్ అయిన తీరు అద్భుతం. తొలి సెట్‌ను సున్నాతో కోల్పోయిన ఈ కవల పిల్లలు.. మెరుపువేగంతో కోలుకున్నారు. తమ ఆటను గాడిలో పెట్టారు. దూకుడుగా ఆడారు. ఎదురు దాడితో సానియా-అంకితా రైనాలను ఉక్కిరిబిక్కిరికి గురి చేశారు. మ్యాచ్‌ను టైబ్రేక్ వరకూ తీసుకెళ్లారు. ఫలితాన్ని నిర్దేశించే కీలకమైన టైబ్రేకర్‌లో సానియా-అంకితా నిస్సారంగా ఆడారు. ఫలితంగా- తమ చేజేతులా మ్యాచ్‌ను ప్రత్యర్థులకు ధారపోసినట్టయింది. ఈ ఓటమితో మహిళల డబుల్స్ టెన్సిస్‌లో ఫైనల్‌కు వెళ్లే ద్వారాలు మూసుకుపోయినట్టయింది.

Tokyo Olympics 2021: Japan Economy అత‌లాకుత‌లం, గేమ్స్ చ‌రిత్ర‌లో అత్యంత ఖ‌రీదైనవిగా|Oneindia Telugu
Story first published: Sunday, July 25, 2021, 10:28 [IST]
Other articles published on Jul 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+