
ఒంటారియో: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో బ్యాట్‌తో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో టోరంటో నేషనల్స్ తరఫున యువరాజ్ ఆడుతున్నాడు. లీగ్‌లో భాగంగా ఆదివారం రాత్రి మోంట్రియల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న యువరాజ్.. తీవ్రమైన వెన్నునొప్పితో పెవిలియన్ చేరాడు.
టోరంటో నేషనల్స్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఏడో ఓవర్‌లో యువరాజ్ క్రీజ్‌లోకి వచ్చాడు. తొలి బంతికి పరుగులేమీ చేయలేదు. రెండో బంతిని స్వీప్ షాట్‌కు యత్నించగా.. బ్యాట్ చేతి నుంచి జారిపోయింది. ఈ క్రమంలోనే వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఫిజియో వచ్చి ప్రాథమిక చికత్స చేసినా.. నొప్పి తీవ్రత తగ్గలేదు. దీంతో యువీ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో టోరంటో నేషనల్స్ 4వికెట్ల తేడాతో విజయం సాధించింది. మోంట్రియల్ టైగర్స్ నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని నేషనల్స్ జట్టు 17.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
సోమవారం బ్రాంప్టన్ వేదికగా విన్నీపెగ్ హాక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఆకట్టకున్నాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసాడు. ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. ఇక బ్రాంప్టాన్ వాల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 51 పరుగులతో మెరిశాడు. లీగ్‌లోని మొదటి మ్యాచ్‌లో మాత్రమే యువీ నిరాశ పరిచాడు.
గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో మాజీ ఆటగాళ్లు యువరాజ్, ఆఫ్రిది, గేల్ రాణిస్తున్నారు. వాన్‌కూవర్ నైట్స్ తరపున ఆడుతున్న 'యూనివర్శల్ బాస్' క్రిస్ గేల్ విశ్వరూపం ప్రదర్శించాడు. 54 బంతుల్లో 12 సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 122 పరుగులు చేసాడు. బ్రాంప్టన్ వోల్వ్స్ తరపున ఆడుతున్న ఆఫ్రిది కూడా 40 బంతుల్లో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారీ ఇన్నింగ్స్‌లతో ఈ వెటరన్ ఆటగాళ్లు తమలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నారు.