న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెదరర్‌కు చుక్కలు చూపించాడు: కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకుకు భారత ఆటగాడు

Buenos Aires ATP Challenger winner Sumit Nagal jumps 26 places to career-best ATP ranking

హైదరాబాద్: సోమవారం ఏటీపీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్‌ నాగల్‌ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఆదివారం ముగిసిన బ్యూనోస్‌ ఎయిర్స్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నీలో విజేతగా నిలిచిన సుమిత్ నాగల్‌ ఏకంగా 26 స్థానాలు ఎగబాకి తన కేరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకుని సాధించాడు.

ఆదివారం జరిగిన బ్యూనాన్‌ ఎయిర్స్‌ ఏటీపీ ఛాలెంజర్స్‌ ఫైనల్లో అర్జెంటీనా ఆటగాడు ఫకండో బోగ్నిస్‌పై వరుస సెట్లలో 6-4, 6-2తో సుమిత్ నాగల్ విజయం సాధించాడు. గంటా 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ నాగల్‌ మ్యాచ్ ఆరంభం నుంచీ తన ఆధిపత్యం ప్రదర్శించాడు. ఫలితంగా సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 135వ ర్యాంకులో నిలిచాడు.

సచిన్ కాదు: రోహిత్ శర్మ ఫేవరేట్ క్రికెటర్ ఎవరో తెలుసా?సచిన్ కాదు: రోహిత్ శర్మ ఫేవరేట్ క్రికెటర్ ఎవరో తెలుసా?

కాగా, ఇటీవలే యుఎస్ ఓపెన్ గ్రాండ్‌ స్లామ్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించిన సుమిత్ నాగల్ తొలి రౌండ్‌లో స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌‌కు చుక్కలు చూపించాడు. తొలి సెట్‌ను గెలిచినా మిగతా రెండు సెట్లు కోల్పోయి ఓటమి పాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో సుమిత్ నాగల్ ఓడిపోయినా... టెన్నిస్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు.

అంతేకాదు ఒక గ్రాండ్‌ స్లామ్‌లో ఫెదరర్‌పై కనీసం ఒక సెట్‌ గెలిచిన తొలి భారత టెన్నిస్‌ ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు. మ్యాచ్ అనంతరం ఫెదరర్ సైతం సుమిత్ నాగల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో అతి పెద్ద విజయాలను సాధించే సత్తా సుమిత్ నాగల్‌లో ఉందని ఫెదరర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, September 30, 2019, 12:45 [IST]
Other articles published on Sep 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X