న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australia Open 2023: అదరగొట్టిన అజరెంకా.. సెమీస్‌లో సానియా జోడీ

 Australian Open 2023: Victoria Azarenka, Sania Mirza-Rohan Bopanna through to semi-finals

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్ 2023‌లో బెలారస్ టెన్నిస్ స్టార్ విక్టోరియా అజరెంకా అదరగొట్టింది. అసాధారణ ప్రదర్శనతో సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అప్పుడెప్పుడో 2013లో చివరిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన అజరెంకా.. మళ్లీ ఇన్నాళ్లకు సెమీఫైనల్‌కు చేరింది. అమ్మగా మారాక తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలన్న పట్టుదలతో ఉన్న ఈ బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌ టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది.

మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో 33 ఏళ్ల అజరెంకా 6-4, 6-1తో మూడోసీడ్‌ జెస్సికా పెగులాను చిత్తుచేసింది. అజరెంకా తన కెరీర్‌లో రెండు గ్రాండ్‌స్లామ్‌ (2012, 2013)లను నెగ్గగా.. ఆ రెండు ఆస్ట్రేలియా ఓపెన్‌లోనే రావడం విశేషం. ఫైనల్‌బెర్త్‌ కోసం వింబుల్డన్‌ విజేత ఎలెనా రిబకినాతో అజరెంకా తలపడనుంది. రిబకినా 6-2, 6-4తో ఓస్టాపెంకోను ఓడించింది.

పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో గ్రీకు వీరుడు సిట్సిపాస్‌ 6-3, 7-6 (2), 6-4తో జిరి లెహెకాను ఓడించాడు. సెమీస్‌లో కారెన్‌ ఖచనోవ్‌తో తలపడతాడు. మరో క్వార్టర్స్‌లో ఖచనోవ్‌ 7-6(5), 6-3, 3-0తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి సెబాస్టియన్ కోర్దా గాయంతో మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. మణికట్టు గాయంతో ఇబ్బంది పడిన కొర్డా.. అలాగే పోరాడాడు. కానీ మూడో సెట్లో గాయం తీవ్రత పెరగడంతో ఆట కొనసాగించలేకపోయాడు.

ఇక కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా టైటిల్‌ దిశగా మరో అడుగువేసింది. రోహన్‌ బోపన్నతో కలిసి ఆమె మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ప్రత్యర్థి జోడీ ఒస్టాపెంకో (లాత్వియా)-వెగా హెర్నాండెజ్‌ (స్పెయిన్‌) వాకోవర్‌ ఇవ్వడంతో బరిలో దిగకుండానే సానియా ద్వయం సెమీస్‌లో అడుగుపెట్టింది. ఫైనల్ బెర్త్ కోసం మూడోసీడ్‌ జంట క్రాజెక్‌ (అమెరికా)-సుపాస్కి (బ్రిటన్‌)తో సానియా-బోపన్న జోడీ తలపడనుంది.

Story first published: Wednesday, January 25, 2023, 9:41 [IST]
Other articles published on Jan 25, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X