న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australia Open 2023 విజేతగా నోవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం!

Australian Open 2023: Novak Djokovic beat Stefanos Tsitsipas to join Rafael Nadal on 22 Grand Slams

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నోవాక్ జకోవిచ్ 6-3, 7-6(7/4), 7-6(7/5) తేడాతో గ్రీక్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్‌ను ఓడించాడు. ఈ విజయంతో కెరీర్‌లో 10వ సారి ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకున్న జకోవిచ్.. ఓవరాల్‌గా 22వ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన దిగ్గజ ప్లేయర్ రఫెల్ నాధల్(22) రికార్డును జకోవిచ్ సమం చేశాడు. ఈ విజయంతో జకోవిచ్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో జకోవిచ్‌కు సిట్సిపాస్ గట్టిపోటీ నిచ్చాడు. తొలి సెట్‌లో జకోవిచ్ సూపర్ స్మాష్ షాట్స్‌తో ప్రత్యర్థి ఆటగాడికి చెమటలు పట్టించి 6-3తో తొలి సెట్ సొంతం చేసుకున్నా.. రెండో సెట్‌లో అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. దాంతో రెండో సెట్ సమమై టై బ్రేక్‌కు దారితీసింది. టై బ్రేక్‌లో అదరగొట్టిన జొకోవిచ్ 7-4తో రెండో సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక కీలకమైన మూడోసెట్ కూడా సమమైంది. దీంతో టై బ్రేక్‌లో అద్భుతంగా రాణించిన జొకోవిచ్ 7-5తో మూడో సెట్‌తో పాటు టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.

కరోనా వ్యాక్సిన్ రగడ నేపథ్యంలో గతేడాది జకోవిచ్ ఈ టోర్నీకి దూరం కావడంతో నాదల్.. ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకున్నాడు. నాదల్ కు ఆ టైటిల్ 21వది. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ కూడా నెగ్గిన నాదల్.. పురుషుల సింగిల్స్ లో అత్యధిక టైటిళ్లు (22) సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. తాజాగా జకో.. నాదల్ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియా ఓపెన్ జకోవిచ్ కు 22వది కావడం గమనార్హం.

ఫైనల్ లో విజయం తర్వాత జకోవిచ్ మాట్లాడుతూ.. 'పెద్ద కలలు కనండి. ఏదైనా సాధ్యమవుతుంది. మీరు ఎక్కడ్నుంచి వచ్చారనేది అనవసరం. మీరు ఎంత కఠినమైన సవాళ్లు ఎదురైతే అంత రాటుదేలుతారు. స్టెఫనోస్, నేను దానికి ప్రత్యక్ష ఉదాహరణ. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే నా కెరీర్ లో ఇదే అతిపెద్ద విజయం.'అని తెలిపాడు. ఈ విజయాన్ని తన సహాయక సిబ్బందికి అంకితం చేశాడు. కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడకుండా జకోవిచ్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించింది.

Story first published: Sunday, January 29, 2023, 18:32 [IST]
Other articles published on Jan 29, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X