న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australia Open 2023: ఫైనల్లో ఓటమి.. ఏడ్చిన సానియా మీర్జా (వీడియో)

 Australia Open 2023: Sania Mirza emotional farewell speech after losing last grand slam mixed doubles final

మెల్‌బోర్న్: కెరీర్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నిరాశే ఎదురైంది. టైటిల్‌తో తన గ్రాండ్‌స్లామ్ ప్రయాణాన్ని ముగించాలనుకున్న ఈ హైదరాబాద్ స్టార్‌కు ఫైనల్లో చుక్కెదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్నతో కలిసి బరిలోకి దిగిన సానియా.. అసాధారణమైన ఆటతీరుతో ఫైనల్‌‌కు దూసుకెళ్లింది. కానీ కీలక టైటిల్ ఫైట్‌లో ఆ జోరు కొనసాగించలేకపోయింది. బ్రెజిల్‌ జోడీ స్టెఫాని-రఫెల్‌ 6-7, 2-6 తేడాతో సానియా-బోపన్న జోడీ ఓటమిపాలైంది. దీంతో సానియా.. గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌కు ఓటమితో వీడ్కోలు పలికినట్లయింది.

ఈ పరాజయంతో తీవ్ర భావోద్వేగానికి గురైన సానియా.. మ్యాచ్‌ అనంతరం తన జర్నీ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది. 'నా ప్రొఫెషనల్‌ కెరీర్‌ మెల్‌బోర్న్‌లోనే మొదలైంది. నా గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ముగించడానికి ఇంతకంటే మంచి వేదిక ఉంటుందని నేను అనుకోను. ఇది నాకు ఎంతో ప్రత్యేకం. నా కుమారుడు చూస్తుండగా గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడతానని నేనెప్పుడూ ఊహించలేదు'అని సానియా మీర్జా ఉద్వేగానికి గురైంది. ఈ వీడియోను ఆస్ట్రేలియా ఓపెన్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. సానియా మీర్జాకు వీడ్కోలు పలికింది.

36 ఏళ్ల సానియా మీర్జా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఓపెన్‌, దుబాయ్‌ ఓపెన్‌ తర్వాత ఆటకు వీడ్కోలు పలకనున్నట్టు వెల్లడించింది. ఆస్ట్రేలియా ఓపెన్ తన కెరీర్ చివరి గ్రాండ్ స్లామ్ అంటూ పేర్కొంది. ఈ టోర్నీలో సానియా మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో పోటీపడింది. మహిళల డబుల్స్‌ నిరాశపర్చినప్పటికీ.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫైనల్‌ వరకు దూసుకెళ్లింది. ఇక, వచ్చే నెలలో జరిగే దుబాయి ఓపెన్‌లో సానియా తన కెరీర్‌లో చివరి టోర్నీ ఆడనుంది.

టెన్సిస్‌లో సానియా మొత్తం 43 డబుల్స్‌ టైటిళ్లు సాధించింది. ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలున్నాయి. మహిళల డబుల్స్‌ కేటగిరీలో 91 వారాల పాటు నంబర్‌ 1 క్రీడాకారిణిగా నిలిచింది. 2009లో మహేష్‌ భూపతితో కలిసి సానియా తన తొలి గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) కైవసం చేసుకుంది. ఆ తర్వాత మరో అయిదు (మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రెండు, మహిళల డబుల్స్‌లో మూడు) గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు సొంతం చేసుకుంది.

Story first published: Friday, January 27, 2023, 15:25 [IST]
Other articles published on Jan 27, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X