న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డోపిగా తేలిన తొలి భారత టెన్నిస్ ప్లేయర్‌గా ఆర్యన్ భాటియా

 Aryaan, 16, becomes first Indian tennis player to fail dope test

హైదరాబాద్: క్రీడలను డోపింగ్ వెంటడుతూనే ఉంది. ప్రభుత్వం ఈ దిశగా ఎన్నో చర్యలను తీసుకుంటున్నప్పటికీ... ఫలితాలు మాత్రం అందుకు అనుకూలంగా ఉండటం లేదు. తాజాగా భారత యువ టెన్నిస్ ఆటగాడు ఆర్యన్ భాటియా డోపీగా పట్టుబడ్డాడు. డోపిగా తేలిన తొలి భారత టెన్నిస్ ప్లేయర్‌గా ఆర్యన్ భాటియా నిలిచాడు.

ఆస్ట్రేలియాతో రెండు టీ20లకు జట్టులో చోటు: ఎవరీ మయాంక్ మార్కండేఆస్ట్రేలియాతో రెండు టీ20లకు జట్టులో చోటు: ఎవరీ మయాంక్ మార్కండే

దీంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు నాడా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 16 ఏళ్ల ఆర్యన్‌ భాటియా గతేడాది ఢిల్లీలో జరిగిన ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ సందర్భంగా నిషిద్ధ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ పరీక్షల్లో తేలింది. దీంతో అతడిని సస్పెండ్‌ చేసినట్లు నాడా వెల్లడించింది.

ఒక టెన్నిస్ ఆటగాన్నుంచి సాంపిల్స్ సేకరించడం ఇదే తొలిసారి. ఆర్యన్‌పై నాడా సస్పెన్షన్‌పై అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి హిరణ్మయ్ చటర్జీ మాట్లాడుతూ "ఆర్యన్‌ కావాలని ఉత్ప్రేరకాలు తీసుకోలేదని, దగ్గు కోసం డాక్టర్ సూచించిన మందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉందని తెలియక వాడాడు. డోపింగ్‌లో ఇప్పటికే అతను చేసుకున్న అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకుంటాం" అని అన్నాడు.

Story first published: Saturday, February 16, 2019, 10:58 [IST]
Other articles published on Feb 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X