న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆక్లాండ్ ఓపెన్‌లో సెరెనా.. మార్గరెట్ కోర్ట్ రికార్డుపై సెరెనా కన్ను!!

America tennis Star Serena Williams set to begin her 2020 season with Auckland Open

వెల్లింగ్టన్: అత్యధిక గ్రాండ్​స్లామ్​లు సాధించిన మార్గరెట్ కోర్ట్ ​(24) రికార్డుకు అమెరికా స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ అడుగు దూరంలో ఉంది​. ఇప్పటికే 23 టైటిళ్లను సొంతం చేసుకున్న సెరెనా.. చివరగా 2017లో ఆస్ట్రేలియా ఓపెన్​లో 23వ గ్రాండ్​స్లామ్​ గెలిచింది. ఈ ఏడాది జరిగిన వింబుల్డన్ ఫైనల్ గెలిచి మార్గరెట్ రికార్డును సెరెనా చేరుకుంటుందని అందరూ ఊహించినా అది జరగలేదు. ఇప్పుడు ఆ కలను నిజం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఆక్లాండ్ ఓపెన్‌లో పాల్గొననున్నట్టు సెరెనా ప్రకటించింది.

లారా సూచన.. విండీస్ ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండాలి!!లారా సూచన.. విండీస్ ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండాలి!!

వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీకి ఆక్లాండ్ ఓపెన్‌ను వార్మప్ లాగా ఉపయోగించుకోవాలని సెరెనా చూస్తోంది. చివరిసారి 2017లో ఆక్లాండ్ టోర్నీలో ఆడిన సెరెనా.. రెండో రౌండ్‌లో మాడిసన్ బ్రెంగిల్ చేతిలో 4-6, 7-6, 4-6 తేడాతో ఓటమిపాలైంది. గాలి బలంగా వీస్తుంది, టెన్నిస్ టోర్నీలకు ఎలాంటి వాతావరణం పనికిరాదని మ్యాచ్ అనంతరం ఘాటుగా స్పందించింది.

2018 జనవరిలో సెరెనా ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెలిచింది. కెరీర్‌లో 23వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించి.. స్ట్ఫెగ్రాఫ్ 22 టైటిళ్ల రికార్డుని బద్దలు కొట్టింది. అనంతరం అలెక్సిస్ ఒహానియన్‌తో సహజీవనం చేస్తున్నానని, ప్రస్తుతం గర్భవతినని ప్రకటించింది. ఇక టెన్నిస్‌కు దూరమైన ఆమె ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించింది. తాజాగా రోజర్స్‌ కప్‌ ఫైనల్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న సెరెనా విలియమ్స్‌ టెన్నిస్‌ కోర్టులోనే కన్నీంటి పర్యంతమైంది. సెరెనా అర్ధంతరంగా తప్పుకోవడంతో బియాంక ఆండ్రీస్కు (కెనడా) విజేతగా నిలిచింది.

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్.. 17 సంవత్సరాల రికార్డును భారత్ కొనసాగించేనా?

'నన్ను క్షమించండి. వెన్ను నొప్పి మరింత ఎక్కువైంది. మ్యాచ్ నేను ఆడలేకపోతున్నా. ఎంత ప్రయత్నించినా.. నా వల్ల కావడం లేదు. నేను మ్యాచ్‌ను కొనసాగించలేను' అంటూ సెరెనా కన్నీటి పర్యంతమైంది. విజేతగా నిలిచిన బియాంక.. సెరెనా దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకుంది. కోర్టులోనే ఏడుస్తున్న సెరెనాను బియాంక ఓదార్చింది.

Story first published: Wednesday, August 21, 2019, 16:41 [IST]
Other articles published on Aug 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X