న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ultimate Kho Kho: తెలుగు యోధాస్ శుభారంభం.. గుజరాత్ చేతిలో ముంబై ఓటమి!

Ultimate Kho Kho: Telugu Yoddhas beats Chennai Quick Guns 48-38 in in tournament opener

ముంబై: లీగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు అదరగొట్టింది. అంచనాలను అందుకుంటూ తొలి మ్యాచ్‌లో సూపర్ విజయాన్ని సాధించింది. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 10 పాయింట్ల తేడాతో చెన్నై క్విక్ గన్స్‌ను ఓడించింది. తెలుగు టీమ్ 48 పాయింట్లు చేయగా.. చెన్నై 38 పాయింట్లకే పరిమితమైంది. స్టార్టింగ్ నుంచే పక్కా ప్లాన్‌తో ఆడిన తెలుగు టీమ్ ప్లేయర్లు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 29-15తో ముందంజ వేశారు.

అయితే రెండో ఇన్నింగ్స్‌లో చెన్నై వరుసగా పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చింది. తెలుగు ప్లేయర్లను కట్టడి చేస్తూ 23-19 లీడ్‌లో నిలిచింది. ఓవరాల్‌గా చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న తెలుగు టీమ్ 10 పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. డిఫెండర్‌ దీపక్‌ మాధవ్, అటాకర్‌ అరుణ్‌ గున్కీ రాణించి తెలుగు యోధాస్‌ గెలుపులో కీలకపాత్ర పోషించారు. తెలుగు యోధాస్‌ స్కోరు చేసిన మొత్తం పాయింట్లలో 24 టచ్‌ పాయింట్లు, 17 డైవ్‌ పాయింట్లు ఉండటం విశేషం.

ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 25 పాయింట్ల తేడాతో ముంబై ఖిలాడిస్‌ను ఓడించింది. గుజరాత్ 69 పాయింట్లు సాధించగా.. ముంబై 44 పాయింట్లే చేసింది. ఈ ఫ్రాంచైజీ ఆధారిత ఈ లీగ్‌ను సీఈవో, కమిషనర్ టెన్జింగ్ నియోగి.. భారత ఖోఖో ఫెడరేషన్ ప్రెసిడెంట్ నుదాన్షు మిట్టర్ ప్రారంభించారు. ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ వారియర్స్‌తో ముంబై ఖిలాడీస్‌, ఒడిషా జగర్‌నాట్స్‌తో చెన్నై క్విక్‌ గన్స్‌ తలపడనున్నాయి.

Story first published: Monday, August 15, 2022, 7:51 [IST]
Other articles published on Aug 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X