న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్విట్టర్‌లో ఎవరేమన్నారు?: మేజర్ ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి

Sportspersons greet nation on National Sports Day, pay tribute to hockey wizard Major Dhyan Chand on his birth anniversary

హైదరాబాద్: హైదరాబాద్: ఆగస్టు 29. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతి. ఈ రోజుని భారత జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 1928 ఆమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు అందించిన ఘనత ధ్యాన్‌చంద్‌‌కే దక్కింది.

ధ్యాన్‌చంద్ నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ఒలింపిక్స్ పతకాలను గెలిచింది. హాకీలో భారత్‌కు చారిత్రాత్మక విజయాలు అందించడంతో పాటు ధ్యాన్ చంద్ ఎన్నో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నారు. భారత్‌ పేరు ప్రపంచ పటంలో మారుమ్రోగి పోవడంతో ధ్యాన్ చంద్ కీలకపాత్ర పోషించాడు.

దీంతో ప్రతి ఏడాది ధ్యాన్‌ చంద్ పుట్టినరోజైన ఆగస్ట్ 29న భారత జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా టీమిండియా క్రికెటర్లు, షూటర్లు, రెజ్లర్లు, బాక్సర్లు, అథ్లెట్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘన నివాళులర్పించారు.

India vs West Indies: జమైకాలో ధోని రికార్డు బద్దలవడం ఖాయం!India vs West Indies: జమైకాలో ధోని రికార్డు బద్దలవడం ఖాయం!

ప్రధాని మాట్లాడుతూ

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ "ఫిట్‌నెస్ అనేది ఎల్లప్పుడూ మన సంస్కృతిలో భాగంగా ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్ సమస్యలపై ఉదాసీనత ఏర్పడింది. కొన్ని దశాబ్దాల క్రితం ఒక సాధారణ వ్యక్తి రోజులో 8-10 కిలోమీటర్లు నడుస్తాడు లేదా పరిగెత్తడం. సైక్లింగ్ చేస్తాడు. ఇప్పుడు సమయాభావం, పనులు భిన్నంగా ఉండటం వల్ల ఫిట్‌నెస్‌కు దూరమవ్వాల్సి వస్తోంది" అని అన్నారు.

సాంకేతికత పెరిగిన కారణంగా

"కాలం మారిపోయింది. సాధారణంగా ప్రజలు సైకిల్ లేదా నడకను ఆశ్రయించాలి. సాంకేతికత పెరిగిన కారణంగా ఎంత నడిచామనే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. అందివచ్చిన టెక్నాలజీని సరైన మార్గంలో వాడుకోవాలి. ప్రస్తుతం జీవనశైలి లోపాలు పెరుగుతున్నాయి. మన ఆరోగ్యం, శ్రేయస్సు మన నియంత్రణలో ఉండాలి. ఫిట్‌నెస్ అనేది ఇండియాలో ఓ ఉద్యమం కాదు" అని మోడీ అన్నారు.

సీరియస్‌గా తీసుకుంటున్నారు

"ప్రపంచ వ్యాప్తంగా దీనిని సీరియస్‌గా తీసుకుంటున్నారు. చైనా చాలా పెద్దఎత్తున 'హెల్తీ చైనా' అనే క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశ్యం 2030 నాటికి చైనాలో ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆరోగ్యకరమైన ప్రజలు ఉన్న దేశం బలమైన దేశం" అని మోడీ ఈ సందర్భంగా తెలిపారు.

ఫిట్‌నెస్ విషయంలో మెట్లు ఎక్కాల్సిందే

"సక్సెస్‌లో ఎలాంటి ఎలివేటర్ ఉండదు(ముఖ్యంగా ఫిట్‌నెస్ విషయంలో). నువ్వు మెట్లు ఎక్కాల్సిందే. నిజం చెప్పాలంటే విజయానికి ఫిట్‌నెస్‌కు కనిపించని బంధం ఉంది. మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే తప్ప మీరు దేనిలోనూ విజయం సాధించలేరు" అని ప్రధాని మోడీ దేశ ప్రజలకు విలువైన సూచన చేశారు.

సోషల్ మీడియాలో ఇలా!

ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్‌ను స్మరించుకుంటూ క్రీడాకారులు సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపించారు.

Story first published: Thursday, August 29, 2019, 14:51 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X