న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఆటకు మీరే బాధ్యులు.. మాకు సంబంధంలేదు: సాయ్

Sports authority of india tells athletes to resume training at their own risk

న్యూఢిల్లీ: క్రీడల్ని, క్రీడాకారుల్ని ప్రొత్సహించాల్సిన స్పోర్ట్స్‌ అథారిటీ అఫ్ ఇండియా (సాయ్‌) కరోనా పరిస్థితుల నేపథ్యంలో బాధ్యత మరిచే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసిజర్‌ (ఎస్‌ఓపీ) పేరిట నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేసిన 'సాయ్‌' తాజాగా ఎవరి ఆటకు వారే బాధ్యులనే సమ్మతి లేఖను సమర్పించాలని ఆటగాళ్లను కోరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆటగాళ్లకు వెన్నంటే మద్దతివ్వాల్సిన సాయ్‌... ఇప్పుడీ కొత్త నిబంధన జతచేసింది. మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆటగాళ్లు ఆడేక్రమంలో, శిక్షణ తీసుకునే విషయంతో 'మాదే బాధ్యత ఇందులో సాయ్‌కి గానీ, సంబంధిత క్రీడా సమాఖ్యకు గానీ సంబంధం లేదు'అనే డిక్లరేషన్‌ ఇవ్వాలని కోరింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతేకాకుండా 'రిలే ట్రైనింగ్‌లో బ్యాటన్ ఎక్స్ చేంజ్‌కు అనుమతి ఉండదు. బాక్సర్లు రింగ్స్‌లోకి రాకూడదు. ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్‌లో సింగిల్స్ ప్లేయర్లు మాత్రమే ప్రాక్టీ చేయాలి.' అని రెండు నెలల విరామం తర్వాత ప్రాక్టీస్‌కు సిద్దమవుతున్న అథ్లెట్లకు ఆంక్షలు విధించింది.

లాక్ డౌన్ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం సడలించడంతో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ సహా 11 రకాల క్రీడల ఔట్ డోర్ ట్రైనింగ్‌కు అనుమతి లభించింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెయిట్ లిఫ్టర్లు, ఆర్చర్లు, సైక్లిస్ట్‌లు, రెజ్లర్లు, ప్యాడర్లు కూడా శిక్షణ తీసుకోవచ్చు. అయితే ఒకరిని ఒకరు తాకే ఆటల్లో బాక్సింగ్ రింగ్స్, స్విమ్మింగ్‌ఫూల్స్‌ను నిషేదించింది.

తండ్రిని ఎక్కించుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయికి బంపరాఫర్!తండ్రిని ఎక్కించుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయికి బంపరాఫర్!

Story first published: Friday, May 22, 2020, 10:19 [IST]
Other articles published on May 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X