న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జొకొకు జ్వరం తెప్పించిన జ్వెరెవ్: సెమీస్‌లో పరాజయం

Serbias Novak Djokovic loses to Alexander Zverev in mens singles semi-finals at Tokyo 2020

టోక్యో: ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌ ఎనిమిదో రోజు.. టెన్నిస్‌లో పెను సంచలనం నమోదైంది. మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో లోకల్ గర్ల్ నవొమి ఒసాకా మూడో రౌండ్‌లోనే వెనుదిరగడమే పెద్ద సంచలనం అనుకుంటే.. దానికి మించిన ఘటన మరొకటి చోటు చేసుకుంది. వరల్డ్ నంబర్ టెన్నిస్ ప్లేయర్, టాప్ సీడెడ్, సెర్బియన్ సూపర్ స్టార్ నొవాక్ జొకొవిచ్ ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో అతను తన చిరకాల ప్రత్యర్థి, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో 1-6, 6-3, 6-1 సెట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు.

ఈ సాయంత్రం అరియాకె టెన్నిస్ పార్క్‌లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జొకొవిచ్.. ప్రారంభంలో తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆలరించినప్పటికీ.. అతని ఎనర్జీ తొలి సెట్‌లోనే హరించుకుపోయినట్టు కనిపించింది. తొలి సెట్‌ను 6-1 తేడాతో గెలుచుకున్న తరువాత ఏ దశలోనూ జొకొవిచ్ ఆధిక్యతను ప్రదర్శించలేకపోయాడు. చివరి రెండు సెట్లలో చేతులెత్తేశాడు. కనీసం ప్రతిఘటించలేకపోయాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్ కొట్టిన భీకర షాట్లను అడ్డుకోలేకపోయాడు.

వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోయాడు. ఫైనల్‌కు చేరలేకపోయాడు. ఈ గెలుపుతో జ్వెరెవ్ ఫైనల్‌లో అడుగు పెట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో అతను రష్యన్ ఒలింపిక్స్ కమిటీకి చెందిన కారెన్ కచనోవ్‌ను ఢీ కొట్టాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్‌కు స్వర్ణ పతకం లభిస్తుంది. రన్నరప్ రజతాన్ని అందుకుంటాడు. కాంస్య పతకం కోసం మరో పోరు ఉంటుంది. ఇందులో నొవాక్ జొకొవిచ్.. స్పెయిన్‌కు చెందిన పాబ్లో బుస్టాను ఎదుర్కొంటాడు. ఇందులో గెలిచిన ప్లేయర్‌ మూడో స్థానంలో నిలుస్తాడు. కాంస్య పతకాన్ని ముద్దాడుతాడు.

ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా జొకొవిచ్ పతకాన్ని అందుకోటేకపోతోన్నాడు. ఈ ఓటమితో ఒకే కేలండర్‌లో నాలుగు మేజర్ టైటిల్స్‌తో పాటు ఒలింపిక్స్ బంగారు పతకాన్ని కూడా సాధించాలనే అతని కల నెరవేరలేకపోయింది. 1988లో స్టెఫీ గ్రాఫ్ ఈ ఘనతను సాధించారు. ఒకే క్యాలెండర్‌లో ఆమె ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌ టోర్నమెంట్లలో ఛాంపియన్‌గా నిలిచారు. అదే ఏడాది దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మహిళల టెన్నిస్ విభాగంలో స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టే అవకాశాన్ని జొకొవిచ్ కోల్పోయాడు.

Story first published: Friday, July 30, 2021, 16:39 [IST]
Other articles published on Jul 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X