న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూత్ బాక్స‌ర్ల‌కు కేంద్ర క్రీడ‌ల మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్ నజరానా

Rajyavardhan Singh Rathore announces cash award of Rs 6.70 lakh for youth boxers

హైద‌రాబాద్: స‌్వ‌ర్ణాలు గెలిచిన యూత్ బాక్స‌ర్ల‌కు కేంద్ర క్రీడ‌ల మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్ భారీ మొత్తంలో న‌గ‌దును న‌జ‌రానాగా ప్ర‌క‌టించారు. గౌహతిలో నిర్వహించిన మహిళల యూత్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళా యూత్ బాక్సర్లు ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు కైవసం చేసుకున్నారు. విజేతలకు బాక్సింగ్‌ సమాఖ్య ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బృంద ఛాంపియన్‌షిప్‌ సాధించిన బాక్సర్లు అందరికీ రూ.6.70 లక్షలను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.

ఇంకా మంత్రి మాట్లాడుతూ..ఇప్పటి వరకు 'అమ్మాయిలు కొన్ని రకాల క్రీడల్లోనే ఆడతారన్న అపోహను మీరు మార్చగలిగారన్నారు. సంకల్పముంటే ఎవరైనా ఎందులోనైనా రాణించగలరని నిరూపించారు. ఆడేందుకు, శిక్షణ తీసుకునేందుకు మీరు ఎన్ని కష్టాలు పడి ఉంటారో నాకు తెలుసు. ఈ దేశంలోని అమ్మాయిలందరికీ మీరు ఆదర్శంగా నిలిచారు. మీ గురించి తెలుసుకున్న అందరూ మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకుంటారని కొనియాడారు. అన్నారు.

క్రీడా సమాఖ్యలను ఉద్దేశించిె క్రీడా పరిపాలనలో పారదర్శకత పెంచేందుకు క్రీడా సమాఖ్యలు తమ వెబ్‌సైట్లలో నిధుల సమీకరణ, ఖర్చుల పద్దులను వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని సూచించారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎవ‌రికీ ఎంత ఖ‌ర్చు పెడుతున్నామ‌నేది అంద‌రికీ తెలిసే అవ‌కాశ‌ముంద‌న్నారు. ప్రస్తుతం ఉన్న క్రీడా విధానాలను పూర్తిగా మార్చే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి క్రీడకు సీఈఓ, హై ఫర్ఫార్మెన్స్‌ మేనేజర్లను నియమిస్తామన్నారు. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకాన్ని మరింత మెరుగుపరిచి టోర్నీల్లో, శిక్షణలో రాణించేలా చేస్తామని పేర్కొన్నారు. సీఈవోలు ఆటగాళ్లకు అవసరమైన స్పోర్ట్స్‌ సైన్స్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌పై దృష్టిపెడితే హై పెర్ఫార్మెన్స్‌ మేనేజర్లు శిక్షణ, టెక్నిక్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తారని వెల్లడించారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 9, 2017, 9:24 [IST]
Other articles published on Dec 9, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X