న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paralympics: 19 పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్.. ముగింపు వేడుకల్లో ఫ్లాగ్ బేరర్‌గా అవని లేఖరా

Paralympics: Twin medalist Avani Lekhara to be Indias flag-bearer for closing ceremony

టోక్యో: ప్రతిష్టాత్మ టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు దుమ్మురేపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 19 పతకాలు సాధించి తమ ప్రయాణాన్ని ముగించారు. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. గత 60 ఏళ్ల చరిత్రలోనే ఓ పారాలింపిక్స్​లో భారత్ బృందం ఇన్ని పతకాలు దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఈ పారాలింపిక్స్‌కు నేడు( ఆదివారం) తెరపడనుంది. ఈరోజు జరగనున్న ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా అవని లేఖరా వ్యవహరించనుంది.

మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్ 1లో గోల్డ్ మెడల్ గెలిచిన అవని.. ఆ తర్వాత 50మీ రైఫిల్ 3 పొజీషన్ ఎస్‌హెచ్ 1లో కాంస్యం సాధించింది. ఓవరాల్‌గా ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత తొలి మహిళగా నిలవడంతో పాటు.. గోల్డ్ మెడల్ గెలిచి భారత తొలి మహిళా క్రీడాకారిణిగా అరుదైన ఘనత సాధించింది.

24వ స్థానంలో భారత్..

24వ స్థానంలో భారత్..

పారాలింపిక్స్‌కి భారత్ నుంచి 54 మంది అథ్లెట్‌లు వెళ్లారు. మొత్తం 9 ఈవెంట్‌లలో క్రీడాకారులు పోటీపడగా.. ఇందులో ఆర్చరీ, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, వెయిట్‌లిప్టింగ్, అథ్లెటిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్) ఈవెంట్స్ ఉన్నాయి. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు 17 పతకాలు దక్కయి. మొత్తంగా పతకాల పట్టికలో భారత్‌కు 24వ స్థానంలో దక్కింది. 207 పతకాలతో డ్రాగన్ కంట్రీ చైనా టాప్‌లో ఉండగా..124 మెడల్స్ గ్రేట్ బ్రిటన్, 104 పతకాలతో అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఆగస్టు 24న జరిగిన ఆరంభోత్సవ వేడుకల్లో భారత పతాకధారిగా షాట్‌ ఫుట్ ఆటగాడు టేక్ చంద్ వ్యవహరించాడు. వాస్తవానికి ఆరంభ వేడుకల్లో భారత పతాకధారిగా మరియప్పన్ తంగవేలుని ఎంపిక చేశారు. కానీ.. తమిళనాడుకి చెందిన ఈ హైజంప్ క్రీడాకారుడు.. ఆఖర్లో ఊహించని విధంగా ఆరంభోత్సవానికి దూరమయ్యాడు. తంగవేలు టోక్యోకి వెళ్లే సమయంలో విమానంలో అతని పక్కన కూర్చున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తంగవేలుని క్వారంటైన్‌లో ఉంచారు. దాంతో.. టేక్ చంద్‌కి పతాకధారిగా వ్యవహరించాడు.

స్వర్ణాలు

స్వర్ణాలు

సుమిత్​ (పురుషుల జావెలిన్​ త్రో, ఎఫ్​ 64 విభాగం)

కృష్ణ నాగర్​ (బ్యాడ్మింటన్​, ఎస్​హెచ్​ 6)

ప్రమోద్​ భగత్​(బ్యాడ్మింటన్​, ఎస్​ఎల్​ 3)

మనీశ్ నర్వాల్(షూటింగ్​, పీ4 మిక్స్​డ్​ 50మీటర్లు పిస్టోల్​ ఎస్​హెచ్​ 1)​

అవని లేఖరా (షూటింగ్​, మహిళల 10మీటర్ల ఎయిర్​ రైఫిల్​ స్టాండింగ్​ ఎస్​హెచ్​ 1)

 రజతాలు

రజతాలు

యోగేశ్​ కతునియా(పురుషుల డిస్కస్​ త్రో, ఎఫ్​ 56 విభాగం )

నిషాద్​ కుమార్​ (పురుషుల హై జంప్,​ టీ 47)

మరియప్పన్​ తంగవేలు(పురుషుల​ హై జంప్,​ టీ63)

ప్రవీణ్ కుమార్​ (పురుషుల​ హై జంప్​, టీ 64)

దేవేంద్ర జజరియా(పురుషుల జావెలిన్​ త్రో, ఎఫ్​​ 46)

యతిరాజ్​ సుహాస్​ (బ్యాడ్మింటన్​ పురుషుల​ సింగిల్స్​ ఎస్​ ఎల్​ 4)

సింగ్​రాజ్​ (పీ 4 మిక్స్​డ్​ 50మీటర్ల పిస్టోల్​ ఎస్​హెచ్​ 1)

భవీనాబెన్​ పటేల్​ (టేబుల్​ టెన్నిస్,​ క్లాస్​ 4)

 కాంస్య పతకాలు..

కాంస్య పతకాలు..

హర్విందర్​ సింగ్​ (ఆర్చరీ )

శరద్ కుమార్​​ (పురుషుల​ హై జంప్​, టీ 63)

సుందర్​ సింగ్ గుర్జార్​​ (పురుషుల​ జావెలిన్​ త్రో, ఎఫ్​ 46)

మనోజ్ సర్కార్​​ (బ్యాడ్మింటన్​ పురుషుల ​సింగిల్స్,​ ఎస్​ ఎల్​ 3)

సింగ్​రాజ్​ (పీ1 పురుషుల​ 10మీటర్ల ఎయిర్​ పిస్టోల్​ ఎస్​హెచ్​ 1)

అవని లేఖరా (ఆర్​ 8 మహిళల 50మీటర్ల రైఫిల్​ 3 పొజిషన్స్​ ఎస్​హెచ్​ 1)

Story first published: Sunday, September 5, 2021, 15:22 [IST]
Other articles published on Sep 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X