షూటర్ అన్నుతో గగన్ పెళ్లి

పుణె: హైదరాబాద్‌ స్టార్‌ షూటర్‌, ఒలింపిక్‌ కాంస్య విజేత గగన్‌ నారంగ్‌ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తోటి షూటర్ అన్నురాజ్ సింగ్‌ను పెండ్లి చేసుకోబోతున్నాడు. వీరి వివాహం ఈ నెల 21న హైదరాబాద్‌లోని ఒక స్టార్‌ హోటల్లో జరగబోతోంది. వీళ్లిద్దరి వయసూ 37 ఏళ్లే. రెండు దశాబ్దాలుగా షూటింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ అనేక అంతర్జాతీయ టోర్నీల్లో కలిసి పోటీ పడుతున్నారు. లండన్ ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ గగన్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ పిస్టల్ షూటర్ అన్నురాజ్‌లకు చాన్నాళ్ల నుంచి పరిచయం ఉంది. అది ప్రేమగా మారి ఇప్పుడు మ్యారేజ్‌కు రెడీ అయ్యారు.

తన తల్లికి అన్ను అంటే చాలా ఇష్టమని, అలాగే అన్ను తల్లిదండ్రులకు తాను నచ్చానని, దీంతో పెళ్లికి మార్గం సుగమగమైందని గగన్‌ తెలిపాడు. ''మేం పెళ్లి చేసుకుందామని సరిగ్గా ఎప్పుడు అనుకున్నామో చెప్పలేను. 2002 నుంచి జట్టు సభ్యులుగా ఉన్నాం. తర్వాత స్నేహితులయ్యాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అన్ని సమయాల్లో ఒకరికొకరు అండగా నిలిచాం. కాలం గడిచేకొద్దీ పెళ్లి చేసుకుందామన్న ఆలోచన ఇద్దరికీ కలిగింది'' అని అన్ను చెప్పింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Read more about: gagan narang other sports
Story first published: Tuesday, April 6, 2021, 8:14 [IST]
Other articles published on Apr 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X