న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా గేమ్స్ 2030 ఆతిథ్యం రేసులో సౌదీ అరేబియా, ఖతార్

Olympic Council of Asia Announce Saudi Arabia, Qatar bid for 2030 Asian Games

న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్ 2030 ఆతిథ్య హక్కుల కోసం సౌదీ అరేబియా, ఖతార్ బిడ్ దాఖలు చేశాయాని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) గురువారం ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ హక్కుల కోసం బిడ్ దాఖలు చేయడానికి ఓసీఏ ఏప్రిల్ 22 ఆఖరి తేదిగా నిర్ణయించగా..ఈ రెండు దేశాలు సంబంధిత పత్రాలతో ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తికనబర్చాయి.

సౌదీ అరేబియా రాజధాని రియాద్, మరియు ఖతార్ రాజధాని దోహా వేదికగా 2030 ఆసియా గేమ్స్ నిర్వహించేందుకు బిడ్ దాఖలు చేశాయి. తమ నేషనల్ ఒలింపిక్ కమిటీ బిడ్ పత్రంతో పాటు, ప్రభుత్వాల ఆమోదు లేఖలను సమర్పించాయి. సౌదీ అరేబియా ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్ నిర్వహించకపోగా.. ఖతార్ మాత్రం చివరిసారిగా 2006లో దోహా వేదికగా ఆతిథ్యం ఇచ్చింది.

ఇక ఆసియా గేమ్స్ 2030 ఆతిథ్యానికి రెండు దేశాలు ముందుకు రావడంపై ఓసీఏ అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్ ఫహద్ అల్ సబాహ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఆసియాలో ఒలింపిక్ మూమెంట్‌పై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుందన్నారు. అలాగే ప్రపంచ స్థాయి కార్యక్రమాలను నిర్వహించే విషయంలో ఆసియా ఖ్యాతిని పెంచుతుందన్నారు. ఇక ఆసియా గేమ్స్ 2030 ఆతిథ్య హక్కుల విషయంపై తుది నిర్ణయాన్ని నవంబర్‌లో వెల్లడిస్తామన్నారు. చైనా వేదికగా జరిగే 6వ ఆసియా బీచ్ క్రీడల సందర్బంగా ఓసీఏ సర్వసభ్య సమావేశంలో ఆసియా గేమ్స్ 2030 ఆతిథ్య హక్కులను ఖారారు చేస్తామన్నారు. ఇక 2020 ఆసియా గేమ్స్‌ను చైనా నిర్వహించనుండగా.. 2026 గేమ్స్ ఆతిథ్య హక్కులను జపాన్ దక్కించుకుంది.

Story first published: Friday, April 24, 2020, 12:12 [IST]
Other articles published on Apr 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X