న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mirabai Chanu: గోల్డ్ కోసం గట్టిగానే ప్ర‌య‌త్నించాను కానీ..: మీరా

Mirabai Chanu says I tried my best to win gold medal at Tokyo Olympics 2021
Weightlifter Saikhom Mirabai ChanuSuccess Story | Oneindia Telugu

టోక్యో: వెయిట్‌ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత భారత్‌కు పతకం అందించింది ఘనత మీరాబాయి చానుకే దక్కింది. దాదాపుగా 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో సిల్వ‌ర్ పతాకాన్ని సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తింది. మీరాబాయికి గట్టి పోటీనిచ్చింది చైనా వెయిట్‌ లిఫ్టర్‌ హూ జిహూయి. మొత్తంగా 210 కిలోలు ఎత్తి స్వర్ణం అందుకుంది. మొత్తానికి ఒలింపిక్స్‌ ఆరంభమైన రెండో రోజే భారత పతకాల కొరతను మీరా తీర్చేసింది. దీంతో భారత త్రివర్ణ పతాకం అంతర్జాతీయ వేదికగా రెపరెపలాడింది.

India vs England: వెనక్కి తగ్గిన బీసీసీఐ.. ఇంగ్లండ్ పర్యటనకు పృథ్వీ షా, సూర్యకుమార్!!India vs England: వెనక్కి తగ్గిన బీసీసీఐ.. ఇంగ్లండ్ పర్యటనకు పృథ్వీ షా, సూర్యకుమార్!!

ప్ర‌య‌త్న‌మైతే చేశా:

ప్ర‌య‌త్న‌మైతే చేశా:

ఈ విజ‌యం త‌ర్వాత మీరాబాయి చాను ఆనందానికి అవ‌ధుల్లేకుండాపోయాయి. అయితే తాను మాత్రం గోల్డ్ కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించాన‌ని చెప్పింది. పతకం 'గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశం మొత్తం నన్ను ఎన్నో అంచ‌నాల‌తో చూస్తోంది. కాస్త ఆందోళ‌న‌గా అనిపించినా.. ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాను. అందుకోసం చాలా కష్టపడ్డాను. గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌డానికి గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించాను కానీ గెల‌వ‌లేక‌పోయా. కానీ ప్ర‌య‌త్న‌మైతే చేశాను. రెండో లిఫ్ట్ చేసిన‌ప్పుడే మెడ‌ల్ గెలుస్తాన‌ని నాకు తెలిసిపోయింది' అని మీరా తెలిపింది.

నా దేశానికి అంకితం ఇస్తున్నా:

నా దేశానికి అంకితం ఇస్తున్నా:

గేమ్ అనంతరం ట్విట‌ర్ ద్వారా మీరాబాయి చాను దేశ‌వాసుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. 'నా దేశం కోసం టోక్యో 2020లో రజత పతకం సాధించినందుకు నిజంగా సంతోషంగా ఉన్నాను. నా కల నిజమైంది. ఈ పతకంను నా దేశానికి అంకితం ఇస్తున్నా. నా కోసం ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్క భారతీయులకు నా ధన్యవాదాలు. నా కుటుంబంకు కృతజ్ఞతలు. ప్రత్యేకంగా నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన మా అమ్మకు. ఆమె నాపై ఎంతో నమ్మకం ఉంచింది. నాకు మద్దతుగా నిలిచిన నా ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, ఐఓఏ, సాయ్, వెయిట్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వేస్, స్పాన్సర్స్, మార్కెటింగ్.. అందరికి ధన్యవాదాలు. నా కోచ్ విజయ్ శర్మ సర్, సపోర్ట్ స్టాఫ్ నా కోసం ఎంతో కష్టపడ్డారు. అందరికి మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని మీరా ట్వీట్ చేసింది.

స్వర్ణం రాదని తెలిసినా:

మీరాబాయికి చైనా వెయిట్‌ లిఫ్టర్‌ హూ జిహూయి గట్టి పోటీనిచ్చింది. అయితే పోటీ జరిగినంత సేపూ మీరా అత్యంత ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది. తనకు పతకం ఖాయమన్న ధీమాతోనే ఆడింది. స్నాచ్‌లో మొదటి అవకాశంలో 84 కిలోలు ఎత్తిన ఆమె.. రెండోసారి 87 కిలోలు ఎత్తింది. అంతకన్నా ఎక్కువ ఎత్తాలన్న ఉద్దేశంతో మూడోసారి 89 కిలోలు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో అద్భుతమే చేసింది. మొదట 110 కిలోలను అలవోకగా ఎత్తింది. అయితే కాంస్యం గెలిచిన విండీ కాంటిక క్లీన్‌ అండ్‌ జర్క్‌లో ఎత్తిన అత్యధిక బరువు 110 మాత్రమే. దాంతో మీరాకు పతకం ఖాయమని అర్థమైపోయింది. రెండో అవకాశంలో 115 కిలోలు ఎత్తి రజతం ఖాయం చేసుకుంది. స్వర్ణం రాదని తెలిసినా.. మెరుగైన రికార్డు కోసం 117 కిలోలు ప్రయత్నించి విఫలమైంది. మొత్తంగా 202 కిలోలతో భారత్‌కు పతకం అందించింది.

Story first published: Saturday, July 24, 2021, 17:04 [IST]
Other articles published on Jul 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X