న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్లజాతీయులకు మద్దతుగా ఫార్ములావన్‌ చాంప్ మెర్సిడెజ్‌ కీలక నిర్ణయం!

Mercedes to race in black F1 livery in message against racism


లండన్‌:
అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యానంతరం 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' పేరుతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు వెస్టిండీస్‌ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. జూలై 8 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టులో విండీస్‌ క్రికెటర్లు తమ జెర్సీ కాలర్‌పై 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' అని ముద్రించిన లోగోతో బరిలోకి దిగనున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విండీస్‌ జట్టుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది.

ఇక తాజాగా ఫార్ములావన్‌ (ఎఫ్‌1) చాంపియన్‌ జట్టు మెర్సిడెజ్‌ నల్ల జాతీయులకు అండగా... జాత్యాహంకారానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. 2020 సీజన్‌లో పూర్తిగా తమ కార్లు నలుపుమయం కానున్నాయని ప్రకటించింది. నలుపు రంగు కార్లతో ఫార్ములావన్‌లో తమ రేసర్లు పాల్గొంటారని తెలిపింది. సహజంగా మెర్సిడెజ్‌ సంస్థ ఎప్పుడైనా సిల్వర్‌ కలర్‌ కార్లతో సర్క్యూట్‌లో దూసుకెళ్లెది. అయితే జాత్యాహంకారానికి, నల్లజాతీయులపై దమనకాండకు ముగింపు పలికే కార్యక్రమంలో భాగంగానే తాము ఈ సీజన్‌లో నలుపు కార్లతో బరిలోకి దిగుతున్నామని టీమ్‌ ప్రిన్సిపల్‌ టొటొ వోల్ఫ్‌ వెల్లడించారు.

'ఇక వర్ణవివక్షపై మౌనం వహించడం ఉండదు. ప్రపంచ క్రీడా వేదికపై మా గళం వినిపించేలా.... మా సంకల్పం ప్రతిబింబించేలా మేం నలుపు రంగు కార్లతో వస్తున్నాం. ఈ వివక్షను ఉపేక్షించం. జాత్యాహంకారం నశించిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం' అని అన్నారు. ఈ ఆదివారం జరిగే ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ హామిల్టన్, అతని సహచరుడు బొటాస్‌ నలుపు కార్లతో ట్రాక్‌పై దూసుకెళ్లనున్నారు.

కరోనాతోనే చస్తున్నామంటే మరొకటి తయారు చేసారంట: హర్భజన్ ఫైర్కరోనాతోనే చస్తున్నామంటే మరొకటి తయారు చేసారంట: హర్భజన్ ఫైర్

Story first published: Wednesday, July 1, 2020, 10:03 [IST]
Other articles published on Jul 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X