న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టైటిల్‌కు చేరువలో కోనేరు హంపి

Koneru Humpy beats Valentina Gunina, jumps to sole lead after win in eighth round of Cairns Cup

సెయింట్ లూయిస్ (అమెరికా): ఈ ఏడాది తొలి టైటిల్‌కు తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌, భారత మహిళల నంబర్ వన్ కోనేరు హంపి విజయం దూరంలో నిలిచింది. కెయిన్స్‌ కప్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌ ఎనిమిదో రౌండ్‌లో రష్యా గ్రాండ్‌ మాస్టర్‌ వాలెంటినా గునీనాపై నెగ్గిన హంపి.. మరో రౌండ్‌ మిగిలుండగానే మొత్తం 5.5 పాయింట్లతో సింగిల్‌గా టాప్‌లో నిలిచింది.

పాపం సౌతాఫ్రికా.. మోర్గాన్ సిక్సర్ల మోత‌తో ఓటమి తప్పలేదు.!పాపం సౌతాఫ్రికా.. మోర్గాన్ సిక్సర్ల మోత‌తో ఓటమి తప్పలేదు.!

ఆఖరి, 9వ రౌండ్‌లో మరో తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ హారికతో తలపడనున్న నేపథ్యంలో హంపి టైటిల్‌ చేక్కించుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెల్లపావులతో ఆడిన హంపి 35 ఎత్తుల్లో గునీనా ఆటకట్టించింది. కాగా, ఉక్రెయిన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ మరియా ముజిచక్‌తో గేమ్‌ను హారిక 58 ఎత్తుల్లో డ్రా చేసుకొంది. మొత్తం 8 రౌండ్ల నుంచి హారిక 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.

ఎనిమిదో రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. ఐదు పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) రెండో స్థానంలో, 4.5 పాయింట్లతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్‌జున్(చైనా), మరియా ముజిచుక్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. నాలుగు పాయింట్లతో హారిక ఆరో స్థానంలో ఉంది. పాయింట్ల పరంగా ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది అగ్రస్థానంలో నిలిస్తే ప్లే ఆఫ్ గేమ్‌ల(ర్యాపిడ్ బ్లిట్జ్, అర్మగెడాన్) ద్వారా ఏకైక విజేతను నిర్ణయిస్తారు.

Story first published: Monday, February 17, 2020, 9:34 [IST]
Other articles published on Feb 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X