న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోల్డ్ మెడల్ గెలిచిన ఆనందంలో నోరు జారిన స్విమ్మర్‌.. వెంటనే నాలుక కరుచుకొని!! (వీడియో)

Kaylee McKeown Puts F-bomb After winning Swimming Gold In Tokyo Olympics

టోక్యో: ప్రతి మనిషి తనలోని బాధను, సంతోషాన్ని బయటపెట్టకుండా ఉండలేడు. పట్టారని భాద, సంతోషం వచ్చినపుడు కొన్ని సార్లు కన్నీళ్లు కూడా వస్తుంటాయి. ఇది సహజమే. ఇంకొన్నిసార్లు మాత్రం ఆనందంలో ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మాట్లాడుతుంటాం. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా స్విమ్మర్‌ కూడా ఇలాగే ఆనందం ఎక్కువయ్యేసరికి మీడియా సమావేశంలోనే నోరు జారింది. తాను తప్పుగా మాట్లాడుతున్నాని వెంటనే గ్రహించి.. నాలుక కరుచుకుంది. ఆపై టాపిక్ డైవర్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే...

ఒలింపిక్‌ రికార్డును సృష్టిస్తూ

జపాన్‌లోని టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌ 2021 ఆస్ట్రేలియా అందాల తార కైల్‌ మెకోన్‌ గేమ్స్‌లో పాల్గొంది. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్లో ఈ ప్రపంచ ఛాంపియన్‌ మెకోన్‌ 57.47 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఒలింపిక్‌ రికార్డును సృష్టిస్తూ.. గోల్డ్ మెడల్ ఎగరేసుకుపోయింది. ప్రపంచ రికార్డు నెలకొల్పిన నేపథ్యం ఉన్న కైల్‌ మెస్‌ (కెనడా, 57.72 సెకన్లు) రజతం, రెగాన్‌ స్మిత్‌ (అమెరికా, 58.05 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నారు. 20 ఏళ్ల మెకోన్‌ దాటికి మెస్‌, స్మిత్‌ వెనకపడిపోయారు. ఫైనల్లో ఫేవరేట్లుగా మెస్‌, స్మిత్‌ బరిలోకి దిగినా.. స్వర్ణాన్ని మెకోన్‌ ఎగరేసుకుపోయింది.

ఆనందంలో నోరు జారిన మెకోన్‌:

ఆనందంలో నోరు జారిన మెకోన్‌:

గోల్డ్ మెడల్‌ గెలిచాక ఓ మీడియా ప్రతినిధి.. పసిడి పతకం గెలుచుకోవడం పట్ల ఎలా ఫీల్‌ అవుతున్నారని యువ స్విమ్మర్ కైల్‌ మెకోన్‌ను ప్రశ్నించాడు. అప్పటికే ఆనంద డోలికల్లో తేలియాడుతున్న కైల్‌ పొరపాటున వాడకూడని ఓ బూతు మాటను (F**K) అనేసింది. అయితే తాను తప్పుగా మాట్లాడానని గుర్తించి.. వెంటనే టాపిక్‌ను డైవర్ట్‌ చేసి చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఆ మీడియా ప్రతినిధి కూడా ఓ నవ్వునవ్వాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెడల్ నెగ్గినందుకు కేలీకి కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు.. పట్టలేని సంతోషంలో ఉన్నప్పుడు ఇలాంటి పదాలు మాట్లాడటం సహజమేనని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. భావోద్వేగాలకు ఎవరూ అతీతులు కాదనడానికి ఈ వీడియో ప్రత్యక్ష సాక్ష్యమని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. లైవ్‌లో బూతు పదం వాడటంపై ఆమె తల్లి స్పందిస్తూ.. తనతో మాట్లాడతానని చెప్పడం విశేషం.

అయ్యో రామ.. ఎంతపనాయే! టోక్యో ఫ్లైట్ మిస్.. హంగేరీలోనే రెజ్లర్‌ వినేష్ పోగాట్‌!!

నాన్న మరణం బాధిస్తుండగానే

నాన్న మరణం బాధిస్తుండగానే

నాన్న కలను నెరవేర్చిన ఆనందంలో 20 ఏళ్ల కైల్‌ మెకోన్‌ ఎంతో ఉద్వేగానికి గురైంది. తన కూతురు ఒలింపిక్స్‌ 2020 ఛాంపియన్‌ కావాలని కలగన్న మెకోన్‌ నాన్న షెల్టో గతేడాది ఆగస్టులో బ్రెయిన్‌ క్యాన్సర్‌తో మరణించాడు. కరోనా కారణంగా టోక్యో 2020 క్రీడలు ఏడాది వాయిదా పడకుండా ఉంటే తన కుమార్తె విజయాన్ని షెల్టో చూసే అవకాశం ఉండేది.

నాన్న మరణం బాధిస్తుండగానే మళ్లీ స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగిన మెకోన్‌.. ఈ జూన్‌లో జరిగిన ఆస్ట్రేలియా స్విమ్మింగ్‌ ట్రయల్స్‌లో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు ఏకంగా గోల్డ్ పట్టేసింది. మెకోన్‌ ఒలంపిక్స్‌లో మెడల్‌ సాధించడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటి వరకు ఆమె ఏకంగా 4 మెడల్స్‌ గెలుచుకొని రికార్డు సృష్టించింది.

Story first published: Wednesday, July 28, 2021, 12:38 [IST]
Other articles published on Jul 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X