న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రిలో ప్రమాదం.. కారులో నుంచి మంటలు!

Haas driver Romain Grosjean escapes with minor burns after horror crash at Bahrain Grand Prix

సాఖిర్‌: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి రేసులో ఆదివారం ఘోర ప్రమాదం తప్పింది. తొలి ల్యాప్‌లో హాస్‌ జట్టు డ్రైవర్‌ రొమైన్‌ గ్రోస్యెన్‌ నియంత్రణ కోల్పోయి ట్రాక్‌ పక్కనున్న బారికేడ్లను ఢీకొట్టాడు. దాంతో అతని కారులో మంటలు చెలరేగాయి. కారు కాక్‌పిట్, చాసిస్‌ వేర్వేరుగా రెండు ముక్కలైపోయాయి. మంటలు చెలరేగిన వెంటనే గ్రోస్యెన్‌ సమయస్ఫూర్తితో స్పందించి కారులో నుంచి బయటకు వచ్చి బారికేడ్లను దాటి సురక్షిత ప్రదేశానికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అక్కడే ఉన్న సహాయక బృందం కూడా వేగంగా స్పందించి గ్రోస్యెన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. గ్రోస్యెన్‌ రెండు చేతులకు, మోకాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనతో రేసును గంటన్నరపాటు నిలిపివేశారు. మంటలను పూర్తిగా ఆపేశాక రేసును కొనసాగించారు. రేసు పునఃప్రారంభమయ్యాక రెండో ల్యాప్‌లోనే రేసింగ్‌ పాయింట్‌ జట్టు డ్రైవర్‌ లాన్స్‌ స్ట్రాల్‌ కారు పల్టీలు కొట్టి ట్రాక్‌ బయటకు వెళ్లింది.

మెర్సిడస్‌ బెంజ్‌ ఎఫ్‌-1 డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌.. బహ్రెయిన్‌ గ్రాండ్‌ ప్రీ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల రేసును పోల్‌పొజిషన్‌ నుంచి రేస్‌ను ఆరంభించిన హామిల్టన్‌ ఆద్యంతం ఆధిక్యంలో కొనసాగాడు.. కెరీర్‌లో 95వ టైటిల్‌ను సొంతం చేసుకొన్నాడు. రెడ్‌బుల్స్‌కు చెందిన వెర్‌స్టాపెన్‌, అలెగ్జాండర్‌ అల్బోన్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

Story first published: Monday, November 30, 2020, 13:14 [IST]
Other articles published on Nov 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X