స్వర్ణ పతకాన్ని గెలిచి.. పిల్లలకు అంకితం చేశాడు..

Posted By:
CWG 2018: Sushil Kumar dedicates gold medal win to children who died in Himachal Pradesh bus accident

హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా పోటీపడిన తొలిరోజే భారత రెజ్లర్లు సత్తాచాటారు. భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రత్యర్థిని కేవలం 80 సెకన్లలో పడగొట్టి ఫైనల్స్‌లో విజయం సాధించాడు. ఇలా కామన్వెల్త్‌లో సుశీల్ స్వర్ణాన్ని గెలుచుకోవడం మూడోసారి (హ్యట్రిక్). గురువారం ఈ రెజ్లర్లందరూ భారత్‌కు పతకాల పంట పండించారు.

భారత్‌కు పతకాల పంటే:

భారత్‌కు పతకాల పంటే:

భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్(75కేజీల విభాగంలో), రాహుల్ అవారే(57కేజీల) స్వర్ణం గెలిచారు. బబితా కుమారి(53కేజీల) రజత పతకం, కిరణ్ బిష్ణోయ్(76కేజీల) కాంస్య పతకం కొల్లగొట్టారు. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా మూడోసారి స్వర్ణంతో మెరిసిన సుశీల్ కుమార్ హ్యాట్రిక్ సాధించాడు. పురుషుల 74 కేజీల ఫ్రీ స్టెల్ విభాగంలో కేవలం 80 సెకన్లలోనే దక్షిణాఫ్రికా రెజ్లర్ జొహాన్నెస్ బోథాపై విజయం సాధించాడు.

చిన్నారులకు అంకితం చేస్తున్నానని:

చిన్నారులకు అంకితం చేస్తున్నానని:

స్వర్ణాన్ని అందుకున్న అనంతరం ఆయన ఈ విజయం చిన్నారులకు అంకితం చేస్తున్నానని తెలిపాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో గెలుపొందిన స్వర్ణ పతకాన్ని ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారికి అంకితం ఇస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించాడు.

మూడోసారి స్వర్ణం గెలవడం గర్వించదగ్గ విషయం:

మూడోసారి స్వర్ణం గెలవడం గర్వించదగ్గ విషయం:

'జీవితం కంటే విలువైన వస్తువు మరొకటి లేదు. మూడోసారి స్వర్ణ పతకం గెలవడం నిజంగా మనందరం గర్వించదగ్గ విషయం. హిమాచల్‌ప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పిల్లలకు ఈ మెడల్‌ను అంకితం చేస్తున్నా' అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

ఆ దుర్ఘటన ఇలా జరిగింది:

ఆ దుర్ఘటన ఇలా జరిగింది:

హిమాచల్ ప్రదేశ్, ధర్మశాల జిల్లాలోని గుర్చల్ గ్రామంలో ఓ మలుపు దగ్గర స్కూలు బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతున్న లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 27 మంది పిల్లలతో పాటు.. బస్సు డ్రైవర్, ఇద్దరు టీచర్లు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.

Story first published: Friday, April 13, 2018, 13:09 [IST]
Other articles published on Apr 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి