వింటర్ ఒలింపిక్స్: 17 ఏళ్లకే స్వర్ణాన్ని గెలుచుకున్న కొరియా పిల్ల

Posted By: Subhan
Chloe Kim's Proud Dad Made The Sweetest Homemade Sign For The Olympics

హైదరాబాద్: వింటర్ ఒలింపిక్స్‌లో టీనేజర్‌ చోలే కిమ్ కిమ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో అదరగొట్టింది. 17ఏళ్ల కిమ్‌ మహిళల హాఫ్‌పైప్‌ స్నోబోర్డింగ్‌ ఈవెంట్‌లో ఏకంగా స్వర్ణ పతకం సాధించింది. అమెరికాలో స్థిరపడ్డ కొరియా సంతతి క్రీడాకారిణి కిమ్‌ తాను పోటీపడ్డ తొలి ఒలింపిక్స్‌లోనే పసిడిని గెలుచుకుంది.

మరిన్ని వింటర్ ఒలింపిక్స్ వార్తల కోసం

తన తండ్రే ప్రేరణ:
ఆమె ఇలా గెలుచుకోవడానికి కారణం తన తండ్రే అని పేర్కొంది. ఆయన తనకు ఎప్పుడూ ప్రేరణగా నిలుస్తారని తెలిపింది. ఆట మొదలయ్యే ముందు కూడా తనలో ఉత్సాహం నింపేందుకు డ్రాగన్ తో పోలుస్తూ ఓ కథను పంపారట.

తనకెంతో ఇష్టమైన, తననెంతగానో అభిమానించే అమ్మమ్మ సమక్షంలో పతకం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని కిమ్‌ తెలిపింది. ఇక కెరీర్‌లో 55 ప్రపంచ కప్‌ విజయాలు సాధించినా, ఒక్క ఒలింపిక్‌ స్వర్ణం కోసం ఇన్నాళ్లూ వేచిచూసిన ఆస్ర్టియా స్కీయింగ్‌ స్టార్‌ మార్సెల్‌ హిర్‌షర్‌ స్వప్నం సాకారమైంది. పురుషుల స్కీయింగ్‌ ఆల్పైన్‌ కంబైన్డ్‌ కేటగిరీలో అతడు స్వర్ణం సాధించాడు.

తన తండ్రి గురించి చెప్తూ కిమ్ కళ్లను చెమర్చింది. తన తండ్రి గురించి ఎప్పుడు ప్రస్తావించినా ఇలానే భావోద్వేగానికి గురౌతానని కిమ్ పేర్కొంది. 98.25 పాయింట్ల స్కోరుతో ఈ వింటర్ ఒలింపిక్స్‌లో విజేతగా గెలవడం ఆనందంగా ఉందని పేర్కొంది. రెండూ మూడు స్థానాల్లో చైనాకు చెందిన లూయి జియాయూ 89.75 పాయింట్లతో, అమెరికాకు చెందిన అరిల్లె గోల్డ్ 85.75పాయింట్లతో ఉన్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 14, 2018, 12:24 [IST]
Other articles published on Feb 14, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి