న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలిసారి ఓ భారతీయుడికి మిస్టర్‌ యూనివర్స్‌ టైటిల్: ఎవరీ చిత్రేష్ నటేసన్?

Bodybuilder Chitharesh Natesan Becomes First Indian To Clinch Mr Universe Title

హైదరాబాద్: చిత్రేష్ నటేసన్... మిస్టర్‌ యూనివర్స్‌ టైటిల్‌ గెలుచుకున్న తొలి భారతీయుడు. కేరళకు చెందిన 33 ఏళ్ల చిత్రేష్ నటేసన్ ప్రపంచ బాడీ బిల్డింగ్‌ అండ్‌ ఫిజిక్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూబీపీఎఫ్)లో భారత్‌ తరఫున తొలిసారి మిస్టర్‌ యూనివర్స్‌ టైటిల్‌ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు.

ఇటీవల దక్షిణ కొరియాలోని జేజు ద్వీపంలో జరిగిన ప్రపంచ బాడీ బిల్డింగ్‌ పోటీల పురుషుల వ్యక్తిగత విభాగాల్లో 38 దేశాల నుంచి 50 మంది బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. ఇందులో 90 కిలోల విభాగంలో పోటీపడిన నటేశన్‌ ప్రథమ స్థానంలో నిలిచి టైటిల్‌‌ను సొంతం చేసుకున్నాడు.

పాక్‌తో డే నైట్ టెస్టు: 'rock-paper-scissors' గేమ్ ఆడిన ఆసీస్ ఓపెనర్లు (వీడియో)పాక్‌తో డే నైట్ టెస్టు: 'rock-paper-scissors' గేమ్ ఆడిన ఆసీస్ ఓపెనర్లు (వీడియో)

తొలుత హాకీ క్రీడాకారుడిగా కెరీర్‌ ప్రారంభించిన చిత్రేష్ నటేసన్ ఆ తర్వాత బాడీబిల్డింగ్‌ వైపు తన ఆసక్తిని పెంచుకున్నాడు. సాధారణ కుటుంబంలో పుట్టిన చిత్రేష్ నటేసన్ కేరళ మహారాజా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కరియవట్టం వర్శిటీలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో మరో డిగ్రీ సంపాదించాడు.

ఆ తర్వాత కొన్ని రోజులు ఢిల్లీలో ట్రైనర్‌గా పనిచేశాడు. అయితే, తాను మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలవడం వెనుక కఠోర ఆహార నియమాలను పాటించాడు. ఏడాది పాటు ప్రతిరోజూ 40 కోడి గుడ్లు, కిలో బోన్‌లెస్‌ కోడి మాంసం, నిర్ణీత పరిమాణంలో చేపలు, ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకుని ఏకధాటిగా ఐదు గంటల పాటు జిమ్‌ చేస్తానని తెలిపాడు.

స్లిప్‌లో రహానే క్యాచ్‌లు మిస్: అసలు కారణం చెప్పిన ఫీల్డింగ్ కోచ్!స్లిప్‌లో రహానే క్యాచ్‌లు మిస్: అసలు కారణం చెప్పిన ఫీల్డింగ్ కోచ్!

ఎన్నిగంటలైనా విసుగు చెందకుండా పట్టుదలతో నిరంతరం శ్రమించడమే తన సక్సెస్‌కు కారణమని చిత్రేష్ నటేసన్ తెలిపాడు. తాను ఈ ఘనత సాధించడానికి గాను విదేశాలకు వెళ్లేందుకు విమాన ఖర్చులు, తన సాధనకు కావల్సిన ఖర్చులను భరించిన స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు.

Story first published: Friday, November 29, 2019, 16:15 [IST]
Other articles published on Nov 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X