న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అథ్లెట్ అంజు బాబీ జార్జ్.. విమెన్ ఆఫ్ ది ఇయర్: వరల్డ్ అథ్లెటిక్స్ నుంచి ప్రతిష్ఠాత్మక పురస్కారం

Athlete Anju Bobby George wins Woman of the Year Award by World Athletics for fight for gender equality

ముంబై: భారత మాజీ అథ్లెట్‌ అంజూ బాబీ జార్జ్ ఓ అరుదైన అవార్డును అందుకున్నారు. వరల్డ్ అథ్లెటిక్స్ ప్రకటించిన అవార్డు ఇది. స్పోర్ట్స్‌లో అత్యుత్తమ ప్రతిభను కనిపరిచిన వారికి ఇచ్చే ఈ పురస్కారం కోసం మాజీ అథ్లెట్ అంజు బాబీ జార్జ్‌ను ఎంపిక చేయడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. మహిళలు వివక్షకు గురయ్యే స్పోర్ట్స్‌లో జెండర్ ఈక్వాలిటీ కోసం ఆమె కృషి చేస్తోన్నారు. ప్రత్యేకంగా ఓ అథ్లెట్ అకాడమీని నెలకొల్పారు. పాఠశాల విద్యార్థినుల కోసం మెంటార్‌గా పని చేస్తోన్నారు.

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వరల్డ్ అథ్లెటిక్స్.. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం అంజు బాబి జార్జ్‌ను ఎంపిక చేసింది. 2003లో నిర్వహించిన ప్రపంచ అథ్లెటిక్స్‌లో లాంగ్‌జంప్‌లో అంజు బాబీ.. రజత పతకాన్ని సాధించారు. లాంగ్‌జంప్‌లో ఎన్నో ఘనతలు అందుకున్నారు. అథ్లెటిక్స్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన తరువాత స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో బాలికలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు.

ఇందులో భాగంగా 2016లో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్‌ అకాడమీని నెలకొల్పారు. ఇప్పటికే అండర్‌-20 విభాగంలో అంజూ బాబీ జార్జీ అకాడమీలో శిక్షణ పొందిన అథ్లెట్లు పతకాల పంట పండించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. పతకాలను గెలుపొందారు. భారతీయ యువతులకు ఆమె రోల్ మోడల్‌గా నిలిచారు. క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, లింగ సమానత్వం కోసం పోరాడుతున్న అంజు బాబీ జార్జ్‌కు విమెన్ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాన్ని అందించనున్నట్లు వరల్డ్ అథ్లెటిక్ ప్రకటించింది.

ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం అంజు బాబీ జార్జ్ అర్హురాలేనని ఇండియన్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ వ్యాఖ్యానించింది. అంజుకు ఈ పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పురస్కారం కోసం తనను ఎంపిక చేయడం పట్ల అంజూ బాబీ జార్జ్ వరల్డ్ అథ్లెటిక్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు, యువతుల కోసం తాను చేస్తోన్న కృషిని వరల్డ్ అథ్లెటిక్స్ గుర్తించడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. క్రీడా ఈవెంట్లల్లో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని, దాని కోసం తాను అహర్నిశలు ప్రయత్నిస్తానని చెప్పారు.

Story first published: Thursday, December 2, 2021, 17:10 [IST]
Other articles published on Dec 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X